చంద్రుని వనరులపై హక్కులు ఏ దేశానివి? ఆ ప్రశ్నలకు అసలు సమాధానం ఇదే!
TeluguStop.com
చంద్రయాన్3( Chandrayaan 3 ) ప్రాజెక్ట్ సక్సెస్ కావడంతో కొత్త కొత్త ప్రశ్నలు వెలుగులోకి వస్తున్నాయి.
చంద్రుని వనరులపై హక్కులు ఏ దేశానివి? అంటూ కొంతమంది సోషల్ మీడియా వేదికగా కామెంట్ చేస్తుండగా శాస్త్రవేత్తలు, నిపుణులు ఆ ప్రశ్నలకు తమదైన శైలిలో సమాధానాలను ఇస్తున్నారు.
జాబిల్లి మానవళి మొత్తానికి సంబంధించినది కాగా అంతర్జాతీయ చట్టాలలో కొన్ని విషయాలను స్పష్టంగా పేర్కొన్నారు.
"""/" /
1966 సంవత్సరం సమయంలో ఐక్యరాజ్య సమితి అంతరిక్ష పరిశోధనల కొరకు ఔటర్ స్పేస్ ట్రీటీని తీసుకొనిరాగా ఔటర్ స్పేస్ ట్రీటీ( Outer Space Treaty ) ప్రకారం చందమామపై కానీ ఇత ఖగోళ వస్తువులపై కానీ ఏ దేశమైనా సార్వభౌమాధికారాన్ని ప్రకటించుకోకూడదు.
ఖగోళ అన్వేషణ అనేది అన్ని దేశాల యొక్క ప్రయోజనం కోసం జరగాలి.ఈ ఒప్పందాలలో ప్రభుత్వ ప్రస్తావనను పొందుపరచగా ఏదైనా ప్రాంతంపై హక్కులను ప్రకటించుకోవచ్చా? లేదా? అనే ప్రశ్నలకు మాత్రం సరైన సమాధానం లేదు.
"""/" /
ఆ తర్వాత 1979 సంవత్సరంలో మూన్ అగ్రిమెంట్ తెరపైకి రాగా ఈ అగ్రిమెంట్ లో చందమామను తమ ఆస్తిగా వ్యక్తులు కానీ ప్రభుత్వ, ప్రభుత్వేతర, అంతర్జాతీయ సంస్థలు కానీ ప్రకటించుకోకూడదు.
చందమామ, అక్కడి వనరులు ఉమ్మడి సొత్తు అని ఒప్పందం చేయగా 1984 సంవత్సరం నుంచి ఈ ఒప్పందం అమలవుతోంది.
అయితే ఇప్పటికే చందమామపైకి ల్యాండర్లను పంపిన అమెరికా, చైనా, రష్యా ( America, China, Russia )మాత్రం ఈ ఒప్పందాలను ఆమోదించకపోవడం గమనార్హం.
ఈ ఒప్పందాలకు కొనసాగింపుగా 2020 సంవత్సరంలో అర్టెమిస్ ఒప్పందం తెరపైకి వచ్చింది.ఈ ఒప్పందం ప్రకారం చందమామపై సురక్షితంగా ప్రయోగాలు చేపట్టాలి.
ఈ ఒప్పందంలో మన దేశం కూడా భాగస్వామిగా ఉండటం గమనార్హం.చంద్రయాన్3 సక్సెస్ తర్వాత ఇస్రో చీఫ్ సోమనాథ్ డ్యాన్స్ చేశారని ఒక వీడియో వైరల్ అవుతుండగా వైరల్ అవుతున్న వీడియో నిజం వీడియో కానీ ఆ వీడియో ఇప్పటి వీడియో కాదని సమాచారం అందుతోంది.
పుష్ప 2 సుకుమార్ కి ఏ రేంజ్ లో హిట్ ఇవ్వబోతుంది…