చంద్రాయన్-3( Chandrayaan – 3 ) ప్రయోగం విజయవంతం కావడంతో ప్రపంచ దేశాలు భారత్ వైపు చూస్తున్నాయి.చంద్రునిపై చేరిన నాలుగో దేశంగా భారత్ రికార్డు సృష్టించింది.ఇదే సమయంలో చంద్రుని దక్షిణ ధ్రువం పై చేరిన తొలి దేశంలో భారత్ చరిత్ర సృష్టించింది.చంద్రాయన్-3 విజయవంతం కావడంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న శాస్త్రవేత్తలు ఇస్రో శాస్త్రవేత్తలను అభినందిస్తున్నారు.ఇండియాలో ఉన్న సెలబ్రిటీలు మరియు రాజకీయ నాయకులు దేశ ప్రజలు చంద్రయాన్-3 విజయవంతం కావడం పట్ల సంబరాలు చేసుకుంటున్నారు. ప్రధాని మోదీ( PM Modi ) దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు.
ఇదే సమయంలో ఇస్రో శాస్త్రవేత్తలను అభినందించారు.ఇదిలా ఉంటే చంద్రాయన్-3 ప్రయోగం విజయవంతం కావడం పట్ల నటుడు ప్రకాష్ రాజ్ ట్విట్టర్ ద్వారా అభినందనలు తెలుపుతూ ట్వీట్ చేశారు.
“భారతదేశం, మానవజాతి గర్వించదగ్గ క్షణాలు అని… దీన్ని సాధ్యం చేసిన వారికి ధన్యవాదాలు అని అన్నారు.ప్రపంచంలో మరిన్ని అద్భుతాలు తెలుసుకోవడానికి ఇది మార్గం అని” స్పష్టం చేశారు.ఇదిలా ఉంటే అంతకుముందు చంద్రయాన్-3 ప్రయోగంపై వ్యంగ్యంగా సోషల్ మీడియాలో ఓ కార్టూన్ బొమ్మ( Cartoon Photo )ను ప్రకాష్ రాజ్ పోస్ట్ చేయడం జరిగింది.చంద్రుడు నుంచి వచ్చిన మొదటి ఫోటో ఇదే అనే క్యాప్షన్ ఇచ్చారు.
దీంతో ప్రకాష్ రాజ్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి.భారత్ ఇస్రో అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రాజెక్టుపై ఎటకారంగా ప్రకాష్ రాజ్( Actor Prakash Raj ) విమర్శలు చేయడం పట్ల చాలామంది సీరియస్ అయ్యారు.
ఇదే సమయంలో కర్ణాటకలో ఆయనపై కేసు కూడా నమోదయింది.పరిస్థితి ఇలా ఉండగా చంద్రాయన్-3 ప్రయోగం విజయవంతం కావడంతో.
ప్రకాష్ రాజ్ అభినందిస్తూ పెట్టిన ట్విట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది.