ఏపీలో సార్వత్రిక ఎన్నికలకు సమయం ఇంకా ఉన్నా .అప్పుడే ఎన్నికల సందడి మొదలైపోయింది.
ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల వ్యూహాల్లో మునిగిపోయాయి.అభ్యర్థుల ఎంపిక పైనా ప్రత్యేకంగా ఫోకస్ పెట్టాయి.
ప్రజల నాడిని పసిగట్టి వారి మద్దతు కూడగట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి.క్షేత్రస్థాయిలో పర్యటనలు చేస్తూ, తమ పార్టీల గొప్పతనాన్ని చెబుతూనే ప్రయత్నం చేస్తున్నాయి.
ఈ సందర్భంగా విపక్షాల పైన తీవ్ర విమర్శలతో విరుచుకుపడుతున్నాయి.ఏపీలో ఎన్నికలకు చాలా సమయమే ఉంది.
షెడ్యూల్ ప్రకారం లోక్ సభ ఎన్నికలతో పాటు, ఏపీ ఎన్నికలు ఏప్రిల్ లో జరగాల్సి ఉంది.అయితే షెడ్యూల్ కంటే ముందుగానే ఏపీలో ముందస్తు ఎన్నికలు జరుగుతాయని అన్ని పార్టీలు అంచనా వేస్తుండగా, అధికార పార్టీ మాత్రం ముందస్తు ఎన్నికలకు వెళ్లే అవకాశం లేదని చెబుతోంది.
ఇక ముందస్తు ఎన్నికలు జరిగినా , షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు జరిగినా, ఎదుర్కొనేందుకు సిద్ధమే అన్నట్లుగా అన్ని పార్టీలు ఉన్నాయి.క్షేత్రస్థాయిలో బలం పెంచుకుని ప్రజలు మద్దతు కూడగట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి.ఇప్పటికే మూడు ప్రధాన పార్టీలు అధినేతలు జనాల బాట పట్టారు.ఇప్పటికే పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలను అమలు చేస్తూ వస్తున్న జగన్ ( CM jagan ).బహిరంగ వేదికల ద్వారా ప్రజల మధ్య అన్ని కార్యక్రమాలను నిర్వహిస్తూ ప్రతిపక్షాలపై తనదైన శైలిలో విరుచుకుపడుతున్నారు .మళ్లీ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మరింతగా ప్రజలకు మేలు చేకూరుస్తామని జగన్ చెబుతున్నారు.
ఇక టిడిపి అధినేత చంద్రబాబు ( Chandrababu Naidu )తన వయసును సైతం లెక్కచేయకుండా నిత్యం జనాల్లోనే ఉంటున్నారు.ప్రభుత్వంపై ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.ప్రస్తుతం ప్రాజెక్టుల సందర్శన కార్యక్రమాన్ని ఆయన నిర్వహిస్తూ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు.ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan )వారాహి యాత్ర పేరుతో ఇప్పటికే రెండు విడతల యాత్రను పూర్తి చేశారు.
మరికొద్ది రోజుల్లో ఉత్తరాంధ్ర నుంచి మూడో విడత యాత్రను మొదలు పెట్టేందుకు సిద్ధమవుతున్నారు.మరోవైపు టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువ గళం పేరుతో పాదయాత్రను నిర్వహిస్తూ ప్రజలు మద్దతు కూడగట్టేందుకు, తన పరపతి పెంచుకునే ప్రయత్నాలు చేస్తున్నారు.
ఈ విధంగా మూడు ప్రధాన పార్టీలు నిరంతరం జనాల్లోనే ఉంటూ జనాల దృష్టిని ఆకర్షించే విధంగా ప్రయత్నాలు చేస్తుండగా , ఈ రేసులో కాంగ్రెస్, బిజెపిలు బాగా వెనకబడిపోయాయి.