తెలంగాణ సంక్షేమ బోర్డు ఏర్పాట్లు చేయాలి..చలో ఇందిరా పార్క్ పిలుపు

ఖమ్మం నగరం( Khammam )లో గురువారం స్థానిక మయూరి సెంటర్ అమరవీల స్థూపం వద్ద ఉద్యమకారుల ఫోరమ్ ఉమ్మడి జిల్లా చైర్మన్ డాక్టర్ కే.వి.

 Telangana Welfare Board Should Make Arrangements..chalo Indira Park's Call , Cha-TeluguStop.com

కృష్ణారావు ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఛలో ఇందిరా పార్కు పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర చైర్మన్ డాక్టర్ చీమ శ్రీనివాస్ హాజరై ప్రారంభించి ఆగస్టు 20 తేదీ న తెలంగాణ సంక్షేమ బోర్డు( Telangana Welfare Board ) ఏర్పాట్లు చేయాలని భాగంగా చలో ఇందిరా పార్క్ కార్యక్రమానికి జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు .అనంతరం వారు మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ బోర్డు సాధనకోసం , ఉద్యమకారుల ఆత్మగౌరవం కోసం , సంక్షేమం కోసం , సామాజిక ప్రజాస్వామిక తెలంగాణ సాధనకోసం గత 5 సం॥లుగా తెలంగాణ రాష్ట్రంలోని 119 నియోజక వర్గాలలోని తెలంగాణ ఉద్యమకారులను ఐక్యపరుస్తూ చైతన్యం చేస్తూ అనేక కార్యక్రమాలు చేస్తున్నాము అని , తెలంగాణ రాష్ట్ర సాధనకోసం1200కు పైగా ఆత్మ బలిదానాలు చేసుకున్నారని వారిలో కేవలం 600 మందినే ప్రభుత్వము ఆదుకోవటం జరిగిందని , తెలంగాణ రాష్ట్ర సాధనకోసం మలిదశలో జరిగిన ఉద్యమంలో అనేకమంది ఉద్యమకారులు తమ ఉపాధిని , కుటుంబాలను ఒదిలిపెట్టి రాష్ట్ర సాధనే ధ్యేయంగా ఉద్యమం చేసారని , విద్యార్థులు చదువులు పక్కనపెట్టి ఉద్యోగ అవకాశాలను వదిలిపెట్టి ఉద్యమంలో పాల్గొన్నారు అన్నారు .తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం .ఉద్యమాలతో సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో గత 10సం॥లలో తెలంగాణ ఉద్యమకారులని పూర్తిగా నిర్లక్ష్యం చేయటం జరిగింది .ఒక్కరోజు జై తెలంగాణ అనని రాజకీయ నాయకులు నేడు భోగాలు అనుభవిస్తున్నారు .

తెలంగాణ రాష్ట్రం కోసం త్యాగం చేసిన ఉద్యమకారులు ఆత్మగౌరవం లేకుండా , అవకాశాలు లేకుండా కనీసం తమ కుటుంబాలు గడవటం కూడా కష్టంగా జీవిస్తున్నారు .అటువంటి ఉద్యమకారులని ఆదుకోవాలని ఝార్ఖండ్ రాష్ట్రంలో అమలు చేస్తున్నట్టు ఇక్కడ తెలంగాణలో తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ బోర్డుని ఏర్పాటు చేయాలని ప్రియతను ముఖ్యమంత్రిని కోరారు .

తెలంగాణ రాష్ట్రము ఏర్పడిన తరువాత అన్ని రంగాల్లో సీమాంధ్ర కార్పొరేట్ వర్గాల ఆధిపత్యం పూర్తిగా తగ్గుతుందని , కానీ సంయుక్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కంటే నేడు అన్ని రంగాల్లో సీమాంధ్ర కార్పొరేట్ వర్గాల ఆధిపత్యము పెరిగిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు .ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పట్లోళ్ల సురేందర్ రెడ్డి , రాష్ట్ర ఉపాధ్యక్షులు జెనిగె విష్ణువర్ధన్ , ఆర్గనైయన్స్ సెక్రెటరీ కారింగుల నరేందర్ గౌడ్ , ఉపాధ్యక్షులు వీరస్వామి గారు , రాష్ట్ర కన్వీనర్ గుడ్డేటి ఐలయ్య యాదవ్ , కొకన్వీనర్ నర్రా సంపత్( Narra Sampath ) మరియు ఖమ్మం జిల్లా తెలంగాణ ఉద్యమకారుల ఫోరం నాయకులు పాలకుర్తి కృష్ణ , అర్వపల్లి విద్యాసాగర్ , తవిడిశెట్టి రామారావు , గోపగాని శంకర్ రావు , గుంతేటి వీరభద్రం , బచ్చల పద్మచారీ , ఆమరణ శ్రీను , దాసరి శ్రీనివాస్ , గంగాధర్ , పెరుగు వెంకటరమణ , దొడ్డ శ్రీనివాస్ రెడ్డి , Sk అబ్బాస్ , Sd బురహన్ , Sk మస్తాన్ , అడపా ప్రవీణ్ కుమార్ , Sk నాగుల్ మీరా , బీవీ , బోడ రమేష్ నాయక్ , బోడ భాస్కర్ నాయక్ , కామ ప్రభాకర్ , పుష్పరాజ్ , రామకృష్ణ , ఆంజనేయులు , ధనుష్ , వల్లెపు సోమరాజు , రామకృష్ణ , పాగి వెంకన్న , ముత్యం , అంబేద్కర్ , ప్రణయ్ , గోపి తదితరులు పాల్గొన్నారు .

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube