దివ్యాంగులకు మరో గుడ్ న్యూస్ చెప్పిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం..!!

తెలంగాణ రాష్ట్రంలో ఉన్న దివ్యాంగులకు( Divyang ) గత నెల ఆసరా పింఛన్ ₹4016కు పెంచుతూ( Asara Pension ) ఉత్తర్వులు జారీ చేయడం తెలిసిందే.పెరిగిన పింఛన్ ఆగస్టు నెల నుంచి అమలులోకి తీసుకొస్తున్నట్లు శుభవార్త అందించారు.

 Telangana State Government Has Given Another Good News To The Disabled Details,-TeluguStop.com

కాగా తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు రాష్ట్రంలో దివ్యాంగులకు మరో గుడ్ న్యూస్ ప్రకటించింది.విషయంలోకి వెళ్తే రాష్ట్రంలో సొంత స్థలం ఉండి ఇల్లు నిర్మించుకునేందుకు గృహలక్ష్మి పథకం( Gruhalakshmi Scheme ) కింద మూడు లక్షల రూపాయలు అందించడానికి ప్రభుత్వం సిద్ధమైన సంగతి తెలిసిందే.

అయితే ఈ పథకంలో దివ్యాంగులకు ఐదు శాతం రిజర్వేషన్ కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నేడు ఆదేశాలు జారీ చేసింది.కాగా ఒక్కో నియోజకవర్గానికి నాలుగు లక్షల మందికి మూడు లక్షలు ఇవ్వాలని నిర్ణయించిన ప్రభుత్వం ఎస్సీలకు 20%, ఎస్టీలకు 10%, బీసీ అదే విధంగా మైనారిటీలకు 50% రిజర్వేషన్ అమలు చేస్తోంది.

ఈ క్రమంలో ఐదు శాతం రిజర్వేషన్ కల్పించడంతో.దివ్యాంగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.మరికొద్ది నెలలలో ఎన్నికలు జరగనున్న క్రమంలో తాజాగా కేసీఆర్( KCR ) ప్రభుత్వం తీసుకుంటున్నా నిర్ణయాలు.తెలంగాణ రాజకీయాలలో సంచలనంగా మారాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube