విడాకుల తర్వాత మొదటిసారి అలాంటి పోస్ట్ చేసిన వెంకట చైతన్య.. మంచి పని చేసావంటున్న నేటిజన్స్!

నిహారిక(Niharika) మాజీ భర్త జొన్నలగడ్డ వెంకట చైతన్య(Venkata Chaitanya) అందరికీ ఎంతో సుపరిచితమే.ఈయన నిహారికను 2020 డిసెంబర్ 9వ తేదీ ఎంతో అంగరంగ వైభవంగా ఉదయపూర్ ప్యాలెస్ లో వివాహం చేసుకున్నారు.

 Niharika Ex Husband Chaitanya Birthday Post Viral Details, Niharika,divorce,venk-TeluguStop.com

అయితే కొంతకాలం పాటు వీరి వైవాహిక జీవితం సంతోషంగా సాగినప్పటికీ ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో విడాకులు తీసుకొని విడిపోయారు.ఇలా నిహారిక చైతన్య ఈనెల 5వ తేదీ తమ విడాకుల గురించి ప్రకటించి అందరికి షాక్ ఇచ్చారు.

ఇక విడాకుల తర్వాత నిహారిక తన వృత్తిపరమైన వ్యక్తిగత జీవితంలో ఎంతో సంతోషంగా ఉండటమే కాకుండా స్వేచ్ఛ జీవిగా విహరిస్తూ ఉంది.

ఇక జొన్నలగడ్డ వెంకట చైతన్య సైతం నిహారికకు విడాకులు(Divorce) ఇవ్వడంతో ఈయన కూడా తన ఎంతో ఫ్రీ అయ్యారని తెలుస్తుంది.అయితే విడాకుల తర్వాత చైతన్య మొదటిసారిగా సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన ఫోటో ప్రస్తుతం వైరల్ అవుతుంది.వెంకటచైతన్య జూలై 26న తన 33వ పుట్టినరోజు వేడుకలను జరుపుకున్నారు.

ఈ విధంగా తన పుట్టినరోజు(Birthday) సందర్భంగా ఈయన సోషల్ మీడియా వేదికగా ఒక స్టైలిష్ ఫోటోని షేర్ చేశారు.ఇలా వెకేషన్ లో చాలా స్టైలిష్ గా ఉన్నటువంటి ఫోటోని షేర్ చేయడంతో ఈ ఫోటో కాస్త వైరల్ గా మారింది.

ఈ విధంగా వెంకట చైతన్య తన 33వ పుట్టినరోజు వేడుకలను జరుపుకుంటున్నారని తెలియడంతో పలువురు ఈయనకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేశారు.ఇకపోతే ఈ ఫోటో పై పలువురు స్పందిస్తూ నిహారికకు విడాకులు ఇచ్చి మంచి పని చేశారు ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ అంటూ కామెంట్లు చేస్తున్నారు.ఇక వెంకట చైతన్య ప్రముఖ బిజినెస్మెన్ గా గుర్తింపు పొందారు.అలాగే ఎంఎన్సీ కంపెనీలలో భారీ స్థాయిలో షేర్స్ కూడా ఉన్న సంగతి మనకు తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube