గత నాలుగు నెలలుగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో( AP Politics ) సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారిన పవన్ కళ్యాణ్ ఎన్నికలు వాతావరణాన్ని కొన్ని నెలలు ముందే ఆంధ్రప్రదేశ్కు తీసుకువచ్చేసారని చెప్పాలి.తన వారాహి యాత్ర ద్వారా అధికార పక్షాన్ని ముప్పతిప్పలు పెడుతున్న పవన్ సంచలనం కలిగించే కొన్ని హాట్ టాపిక్స్ ను ఎంచుకుని మరీ వారాహి యాత్ర వేదికగా మాట్లాడారు.
ముఖ్యంగా అధికార వైసీపీ( YCP ) తీసుకొచ్చిన వాలంటీర్ వ్యవస్థ పై ఆయన చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం కలిగించాయి .ఇలాంటి వ్యాఖ్యల వల్ల పార్టీకి జరిగే మంచి కంటే చెడే ఎక్కువ ఉంటుందని విశ్లేషణలు వినిపించినా కూడా పవన్ ఎక్కడ వెనకకు తగ్గకుండా దూకుడు చూపించారు.
పవన్ వ్యాఖ్యలపై( Pawan Kalyan ) అనుకూలంగాను వ్యతిరేకంగానూ అనేక చర్చా కార్యక్రమాలు గత కొన్ని రోజులుగా నడిచాయి .అయితే ఇప్పుడు పవన్ వ్యాఖ్యలపై కోర్టుకు వెళ్లడానికి సిద్ధపడింది వైసిపి సర్కార్.ప్రజలకు సేవ చేస్తున్న అతిపెద్ద వ్యవస్థ పై ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయడం ద్వారా వారి ఆత్మ విశ్వాసాన్ని పవన్ దెబ్బ కొట్టారని అంటున్న ప్రభుత్వం దానిని న్యాయస్థానం వేదికగా నిరూపించాలనే పట్టుదలతో ఉన్నట్లుగా తెలుస్తుంది.అయితే ప్రభుత్వం కోర్టుకు వెళ్లినా ,తనను అరెస్ట్ చేసినా కూడా తాను వెనకకు తగ్గనని పవన్ తన వ్యవహార శైలి ద్వారా నిరూపిస్తున్నారు .
నిన్న మంగళగిరి పార్టీ కార్యాలయం( Mangalagiri Party Office )లో జరిగిన విలేకరుల సమావేశంలో కూడా మీరు ఎన్ని కేసులు పెట్టుకున్నా తాను వెనుకకు తగ్గనని , ప్రజలకి సంబందించిన 23 రకాల విషయాలపై సమాచారం తీసుకుంటున్న వాలంటీర్ వ్యవస్థ తనకు తెలియకుండానే అక్రమాలకు ఊతం ఇచ్చినట్లు ఆవుతుందని , ఈ విషయంపై తాను కేంద్ర హోంమంత్రికి కూడా ఫిర్యాదు చేశానని ,తెలిసీ తెలియకుండా చేస్తున్న పనుల వల్ల వాలంటీర్లు( Volunteers ) కూడా ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు అంటూ ఆయన హెచ్చరిక చేశారు.ఒకప్పుడు తనను విశాఖపట్నంలో రూమ్లో నిర్బంధించిన ప్రభుత్వ వ్యవస్థ పై ఉక్కిరిబిక్కిన అయిన పవన్ నేడు ఏం జరిగినా సరే తేల్చుకుంటానంటూ సిద్ధమవటం వెనక కారణాలు ఏమిటంటూ విశ్లేషణలు వస్తున్నాయి .కేంద్రం అండ బలంగా దొరికింది కాబట్టే పవన్ అంత ధైర్యంగా ఉన్నారని కొంతమంది వ్యాఖ్యానిస్తుంటే రాష్ట్ర రాజకీయాల్లో తాడోపేడో తేల్చుకోవాలన్న స్థిర నిశ్చయనికి పవన్ కళ్యాణ్ రావడం వల్లే పవన్ ఇంత ధైర్యంగా ముందుకు వెళ్తున్నారని కొంతమంది వ్యాఖ్యానిస్తున్నారు.