INDIA అంతా ఒకే.. అదొక్కటే డౌట్ ?

వచ్చే ఎన్నికల్లో ఎన్డీయే కూటమిని( NDA ) గద్దె దించడమే లక్ష్యంగా విపక్షాలన్నీ ” INDIA ” పేరుతో కూటమిగా ఏర్పడిన సంగతి తెలిసిందే.గత తొమ్మిదేళ్లుగా బీజేపీ పాలనలో కేంద్రం బ్రష్టు పట్టిందని, ఈసారి కూడా ఎన్డీయే అధికారంలోకి వస్తే ప్రతిపక్ష పార్టీలే లేకుండా బీజేపీ పావులు కదిపే అవకాశం ఉందని.

 India అంతా ఒకే.. అదొక్కటే డౌట్ ?-TeluguStop.com

అందుకే మోడిని గద్దె దించడం కోసం అందాలు కలిసిమెలిసి అడుగులు వేయాలని విపక్షాలు ఐక్యతకు పిలుపునిచ్చాయి.ఇప్పటికే బీజేపీ వ్యతిరేకంగా 26 పార్టీలు INDIA లో సభ్యత్వం కలిగి ఉన్నాయి.

ఇంతవరుకు బాగానే ఉన్నప్పటికి విపక్షాల తరుపున ప్రధాని అభ్యర్థి ఎవరనేదే మిస్టరీగా మారింది.

Telugu Congress, India, India Alliance, Mamta Banerjee, Nitish Kumar, Rahul Gand

గత నెలలో విపక్ష పార్టీలన్నీ( Opposition Parties ) ఐక్యత కోసం పాట్నాలో మొదటి సమావేశం నిర్వహించాయి.ఇక నిన్న మరియు మొన్న మరోసారి బెంగళూరులో సమావేశం అయ్యాయి.నిన్న జరిగిన సమావేశంతో కూటమికి పేరు ఒకే అయిపోయిన ప్రధాని అభ్యర్థి( PM Candidate ) ఎవరనేది ఇంకా తేలలేదు.

విపక్షాలలో రాహుల్ గాంధీ, నితీశ్ కుమార్, మమతా బెనర్జీ, కేజ్రీవాల్ వంటి వారు ప్రధాని రేస్ లో ముందున్నారు.వీరిలో ఎవరిని పి‌ఎం అభ్యర్థిగా నిలబెట్టాలనేది విపక్షలకు కత్తిమీద సాము లాంటి సమస్యే.

అయితే చాలా వరకు విపక్షాలన్నీ ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ వైపే చూస్తున్నట్లు తెలుస్తోంది.

Telugu Congress, India, India Alliance, Mamta Banerjee, Nitish Kumar, Rahul Gand

ఇటీవల జరిగిన సమావేశంలో మమత బెనర్జీ రాహుల్ గాంధీపై( Rahul Gandhi ) సానుకూలంగా స్పందించారు.అంతకు ముందు లాలూ యాదవ్, వంటి వారు కూడా రాహుల్ ప్రధాని కావాలని ఆకాంక్షించారు.దీన్ని బట్టి చూస్తే విపక్షాల తరుపున ప్రధాని అభ్యర్థిగా రాహూల్ గాంధీ దాదాపు కన్ఫర్మ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

అయితే విపక్షాలన్నీటిని ఒకే తాటిపైకి తీసుకురావడంలో నితిశ్ కుమార్ ముఖ్య భూమిక పోషించారు.పి‌ఎం కావాలనే అకాంక్ష ఆయనలో ఎప్పటి నుంచో ఉందనేది జగమెరిగిన సత్యం.మరి పి‌ఎం అభ్యర్థిగా రాహూల్ గాంధీకి ఆయన మద్దతు ఎంతవరుకు ఉంటుందనేది ప్రశ్నార్థకమే.మొత్తానికి బీజేపీకి చెక్ పెట్టె దిశగా అడుగులు వేస్తున్న విపక్షాలు ప్రధాని అభ్యర్థి విషయంలో ఎప్పుడు స్పస్టతనిస్తాయో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube