హలో మాదిగ- చలో హైదరాబాద్

మాదిగల విశ్వరూపం మహా సభను విజయవంతం చేయండి రాజన్న సిరిసిల్లా జిల్లాలో ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో శనివారం ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించడం జరిగింది.ఈ సమావేశానికి ముఖ్య అతిధిగా ఇంజం వెంకటస్వామి మాదిగ( Injam Venkataswamy Madiga ) హాజరయ్యారు.

 Hello Madiga- Cello Hyderabad , Mrps, Injam Venkataswamy Madiga-TeluguStop.com

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాలకుల నిర్లక్ష్యం,మోసం కారణంగా నే సామాజిక న్యాయం ఆయిన ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ చట్టబద్దత కు నోచుకోలేదని అన్నారు.సామాజిక ఉద్యమ నేత మందకృష్ణ మాదిగ నాయకత్వంలో ఆగస్టు లో వర్గీకరణ కై మరో పోరాటానికి మాదిగ, మాదిగ ఉపకులాలు, సామాజిక ఉద్యమ శ్రేణులు సిద్ధం కావాలని పిలుపునిస్తున్నామని అన్నారు.

అందుకోసం అన్ని గ్రామాల నాయకత్వం గోటూ విలేజ్ మిషన్ 25 డేస్ అమలు చేయాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో తంగళ్లపల్లి దేవరాజు మాదిగ ఎమ్మార్పీఎస్ జిల్లా కన్వీనర్, ఎమ్ ఎస్ పి జిల్లా ఇంచార్జ్ అవునూరి ప్రభాకర్ మాదిగ,ఎమ్ ఎస్ పి జిల్లా కోఆర్డినేటర్ ఖానాపురం లక్ష్మణ్ మాదిగ,ఎం ఎస్ పి వేములవాడ నియోజకవర్గ ఇన్చార్జ్ నెదూరి నర్సయ్య మాదిగ, ఎమ్మార్పీఎస్ వేములవాడ చంద్రశేఖర్ మాదిగ, ఎమ్మార్పీఎస్ జిల్లా నాయకులుపసుల కమలాకర్ మాదిగ,లక్ష్మీనారాయణ జిల్లా అధ్యక్షులు,చిందు హక్కుల పోరాట సమితి నాయకులు ధనూజాయ్ తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube