కేజీఎఫ్ 2 మాదిరిగానే సలార్ 2 కి కూడా చేస్తారా ఏంటి?

కన్నడ స్టార్‌ దర్శకుడు ప్రశాంత్ నీల్ ( Prashanth Neel )దర్శకత్వం లో వచ్చిన కేజీఎఫ్‌… కేజీఎఫ్‌ 2 సినిమా లు ఏ స్థాయి లో విజయాన్ని సొంతం చేసుకున్నాయో తెల్సిందే.ఇప్పుడు కేజీఎఫ్ 2 ఒక ట్రెండ్‌ సెట్టర్ గా నిలిచింది.

 Like Kgf, Salar Movie Is Also Very Late ,prashanth Neel , Kgf Movie, Salar, Sh-TeluguStop.com

వెయ్యి కోట్ల కు పైగా వసూళ్లు రాబట్టిన కేజీఎఫ్ 2 సినిమా తర్వాత ప్రశాంత్‌ నీల్ చేస్తున్న సినిమా సలార్‌. కేజీఎఫ్ తరహాలోనే సలార్ ను కూడా రెండు భాగాలుగా తీసుకు రావాలనే నిర్ణయానికి వచ్చారు అంటూ వార్తలు వస్తున్నాయి.

Telugu Salaar, Kgf, Prashanth Neel, Shruti Haasan, Tollywood-Movie

విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం సలార్‌ ( Salaar )షూటింగ్ ను ఒకే సారి పూర్తి చేసి దాన్ని రెండు భాగాలుగా విడుదల చేయాలనే నిర్ణయానికి వచ్చారు.భారీ అంచనాల నడుమ రూపొందుతున్న సలార్ సినిమా లో ప్రభాస్ యొక్క లుక్ మరియు స్టైల్‌ ఫ్యాన్స్ కి పిచ్చెక్కిస్తోంది.ఇటీవల విడుదల అయిన టీజర్ సినిమా పై అంచనాలను వెయ్యి రెట్టకు పెంచింది అనడంలో సందేహం లేదు.మొదటి భాగంతోనే వెయ్యి కోట్ల కు పైగా వసూళ్లు నమోదు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఈ రేంజ్‌ లో సలార్‌ బిజినెస్ చేయడం ద్వారా రికార్డు బ్రేకింగ్‌ వసూళ్లు చేయడం కన్ఫర్మ్‌ అనే వార్తలు వస్తున్నాయి.అయితే సలార్‌ 1 ను ఈ ఏడాది సెప్టెంబర్‌ లో విడుదల చేయాలని… సలార్ 2 ను వచ్చే ఏడాది సమ్మర్ లో విడుదల చేయాలని భావిస్తున్నారు.

Telugu Salaar, Kgf, Prashanth Neel, Shruti Haasan, Tollywood-Movie

అందుకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి.అయితే సలార్‌ 2 దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ అన్నట్లుగా వచ్చే ఏడాది సమ్మర్ లో కానీ.చివరి వరకు కానీ వచ్చే అవకాశాలు లేవు అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కేజీఎఫ్ 2 ( Kgf 2 )సినిమా ను కూడా వెంటనే విడుదల చేస్తాను అంటూ చెప్పి దాదాపుగా రెండేళ్ల పాటు అభిమానులను వెయిట్‌ చేయించాడు.

షూటింగ్ పూర్తి చేసి కూడా వెయిట్‌ పెంచేందుకు వాయిదాల మీద వాయిదాలు వేశారు.చివరకు రెండేళ్ల కు విడుదల చేశారు.సలార్ పరిస్థితి కూడా రేపు అంతే అన్నట్లుగా కొందరు కామెంట్స్ చేస్తున్నారు.రెండవ పార్ట్‌ విడుదలకు చాలా ఆలస్యం చేస్తారని ప్రభాస్ అభిమానులు మాట్లాడుకుంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube