దేశ వ్యాప్తంగా బిజెపికి( BJP ) ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడడం, వచ్చే ఎన్నికల్లో కేంద్రంలో బిజెపి అధికారంలోకి వచ్చేందుకు చాలానే కష్టపడాలనే సంకేతాలు వెలువడుతూ ఉండడం వంటి కారణాలతో తమకు మిత్రబక్షాల బలం ఉంది అని నిరూపించుకునేందుకు బిజెపి ప్రయత్నాలు చేస్తోంది.దీనిలో భాగంగానే ఈనెల 18 న విపక్షాల కూటమితో సమావేశాన్ని ఏర్పాటు చేసింది.
ఈ సందర్భంగా తమతో కలిసి వచ్చే వివిధ రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీలను ఎన్డీఏలో చేరాల్సిందిగా బిజెపి ఆహ్వానాలు పంపుతోంది .ఇక ఏపీలో అధికార పార్టీగా ఉన్న వైసీపీని( YCP ) కూడా ఎన్డీఏలో చేరాల్సిందిగా ఇటీవల ఢిల్లీకి వెళ్లిన జగన్( jagan ) కు బిజెపి కేంద్ర పెద్దలు సూచించినా, జగన్ మాత్రం ఎన్డీఏలు చేరకుండా బయట నుంచి మద్దతు ఇస్తామని చెప్పి వచ్చారు.
ఇక ఒకటి రెండు ఎంపీ సీట్లు ఉన్న పార్టీలను కూడా ఎన్డీఏలో చేరాల్సిందిగా ఆహ్వానాలు పంపుతున్నారు.అయితే ఏపీలో జనసేనతో అధికారికంగా పొత్తు పెట్టుకున్న జనసేనకు ఈ ఆహ్వానం అందిందా లేదా అనే విషయంలో క్లారిటీ మాత్రం రావడం లేదు.ఇప్పటికే బీజేపీ వైఖరిపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్(Pawan Kalyan ) అసంతృప్తితో ఉన్నారు.ముఖ్యంగా ఏపీ బీజేపీ నేతలు ఎవరూ జనసేన ను పట్టించుకోనట్టుగా వ్యవహరిస్తుండడం, ఏ విషయంలోనూ ప్రాధాన్యం ఇవ్వకపోవడం వంటివి చేస్తున్నారు.
అయినా పవన్ సర్దుకుపోతూనే వస్తున్నారు.కేంద్ర బిజెపి పెద్దలపై ప్రశంసలు కురిపిస్తూనే వస్తున్నారు.
తన అసంతృప్తిని ఎక్కడా బయటపడకుండా జాగ్రత్త పడుతున్నారు.ఇదే సమయంలో ఎన్డీఏలో చేరాల్సిందిగా జనసేనకు ఆహ్వానం అందిందా లేదా అనేది ఎవరు క్లారిటీ ఇవ్వడం లేదు.బిజెపి నేతలు కూడా ఈ విషయంపై స్పందించడం లేదు.ఏపీ ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న తెలుగుదేశం పార్టీని కూడా ఎన్డీఏలో చేరాల్సిందిగా ఆహ్వానం పంపినట్లుగా ప్రచారం జరుగుతోంది.
కానీ జనసేనను బిజెపి అగ్ర నేతలు లెక్కల్లోకి తీసుకోలేదనే విషయంపైనే ఇప్పుడు చర్చ జరుగుతోంది.అన్ని పార్టీలకు ఎన్డీఏలో చేరాల్సిందిగా ఆహ్వానాలు పంపి జనసేన ను విస్మరిస్తే అది పవన్ కు అవమానకరం.
రాజకీయంగాను ఏపీలో జనసేన బిజెపిల బంధానికి బీటలు వారే ప్రమాదం లేకపోలేదు.