Krithi Shetty : డేంజర్ జోన్ లో కృతి శెట్టి కెరీర్..అందుకే ఇలాంటి పనులు చేస్తుందా ?

కృతి శెట్టి( krithi shetty ).ఉప్పెన సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీ కి దూసుకచ్చిన కత్తి లాంటి అమ్మాయి.

 Krithi Shetty Strategy To New Movie-TeluguStop.com

ఆ సినిమా విజయవంతం అవ్వడం తో ఓవర్ నైట్ లో కృతి గురించి టాలీవుడ్ మొత్తం చర్చించడం మొదలు పెట్టింది.అందరు ఊహించినట్టు గానే లక్కీ ఛార్మ్స్ కి టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీ లో అవకాశాలు వెతుకుంటూ వస్తాయి.

కృతి శెట్టి కూడా ఉప్పెన సినిమా( Uppena ) తర్వాత బంగార్రాజు, శ్యామ్ సింగ రాయ్ సినిమాలను ఒప్పుకుంది.ఈ మూడు సినిమాలు విజయం సాధించడం తో హ్యాట్రిక్ హిట్ హీరోయిన్ గా కృతి సూపర్ ఫామ్ అందుకుంది.

కానీ ఈ మూడు సినిమాల తర్వాత మంచి కథలను ఎంచుకోవడం లో విఫలం అయ్యింది.

Telugu Bangarraju, Krithi Shetty, Suriya, Tollywood, Uppena-Movie

అందుకే హ్యాట్రిక్ ప్లాప్స్ ఆమె ఖాతాలో పడ్డాయి.ప్రస్తుతం కృతి శెట్టి కెరీర్ డేంజర్ జోన్ లో ఉంది.వరస పరాజయాలు ఆమె కెరీర్ ని డోలాయమానం లో పడడం తో ప్రస్తుతం కృతికి చిక్కులు వచ్చి పడ్డాయి.

పైగా తమిళ్ సూపర్ స్టార్ హీరో సూర్య ( Suriya )తో నటిస్తున్న సినిమా మధ్యలోనే ఆగిపోయింది.దాంతో బేబమ్మ కు భయం పట్టుకుంది.ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ అయిపోతుంది అనుకున్న ఈ అమ్మడు ప్రస్తుతం పూర్తి నిరాశలో కూరుకుపోయింది.అయితే ఓటమిని ఒప్పుకోవడం కృతి శెట్టి కి ఇష్టం ఉండదు.

అందుకే వరస ఫోటో షూట్స్ ప్లాన్ చేసింది.దాదాపు ఆరు వారాల్లోనే పద్నాలుగు ఫోటో షూట్స్ చేసి మేకర్స్ కి తాను ఎంత టఫ్ అని చూపించింది.

Telugu Bangarraju, Krithi Shetty, Suriya, Tollywood, Uppena-Movie

దాంతో ఆమె చేతిలో ఇప్పుడు ఒక కొత్త ప్రాజెక్ట్ వచ్చి చేరింది.ఈ చిత్రానికి కన్నా ముందు మలయాళంలో టోవినో థామస్ పక్కన హీరోయిన్ గా ఒక చిత్రంలో నటిస్తుంది.ఆ తర్వాత జయం రవి సరసన జీని సినిమా లో ఒక హీరోయిన్ గా చేస్తుంది.ఈ చిత్రంలో ముగ్గురు హీరోయిన్స్ ఉండగా, అందులో ఒక హీరోయిన్ గా కృతి ఎంపిక అయ్యింది.

అయితే ఈ అమ్మడు అవకాశాలు లేకపోవడం తో ఫోటో షూట్స్ తో యూత్ కి టచ్ లో ఉండటం, తద్వారా కొత్త సినిమాలను లైన్ లో పెడుతుంది.దీంతో మిగతా హీరోయిన్స్ కృతి స్ట్రాటజీ చూసి జలస్ ఫీల్ అవుతున్నట్టుగా తెలుస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube