సాధారణంగా 11 సంవత్సరాల వయస్సు ఉన్న పిల్లలు ఆడుకుంటూ చదువుకుంటూ కాలం వెళ్లదీస్తారు.అయితే ఒక చిన్నారి మాత్రం 11 సంవత్సరాల వయస్సులోనే వందల కోట్లు సంపాదిస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు.
ష్పా( Youtuber Shfa ) అనే చిన్నారి యూట్యూబ్ ద్వారా కళ్లు చెదిరే స్థాయిలో ఆదాయం సంపాదిస్తూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతున్నారు.అరబిక్ భాషలో వీడియోలు చేసే ఈ చిన్నారి తన వీడియోల ద్వారా పాపులర్ అయ్యారు.
పిల్లలకు ఉపయోగకరమైన వీడియోలను ఈ చిన్నారి సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేయడం గమనార్హం.2015 సంవత్సరం మార్చి నెలలో ఈ చిన్నారి యూట్యూబ్ ఛానల్( Youtube Channel ) ప్రారంభమైంది.ఈ చిన్నారి అన్ని యూట్యూబ్ ఛానెళ్లకు 40 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు.ఈ చిన్నారి నెల సంపాదన కోటి రూపాయల కంటే ఎక్కువ మొత్తం కాగా ఈ చిన్నారి యూట్యూబ్ ద్వారా వందల కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు.
ఈ చిన్నారి చాలా బ్రిలియంట్, టాలెంటెడ్ అని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.ప్రతి వీడియో సంథింగ్ స్పెషల్ అనిపించేలా ఈ చిన్నారి యూట్యూబ్ వీడియోలు ఉన్నాయి.ష్పా ( Shfa ) నికర సంపాదన 410 కోట్ల రూపాయలు కావడం గమనార్హం.ష్పా సక్సెస్ స్టోరీ తెలిసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.ఈ చిన్నారికి హ్యాట్సాఫ్ చెప్పాలని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
ఎంత ఎదిగినా ష్పా సింపుల్ గా ఉండటానికి ఇష్టపడుతున్నారు.ఎనిమిదేళ్ల వ్యవధిలోనే ష్పా ఏకంగా 984 వీడియోలను అప్ లోడ్ చేయడం గమనార్హం.ష్పా వీడియోలు ప్రస్తుతం హిందీలో కూడా అందుబాటులో ఉన్నాయి.
ష్పా రాబోయే రోజుల్లో కెరీర్ పరంగా మరింత ఎదగాలని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.తల్లీదండ్రుల నుంచి ప్రోత్సాహం ఉండటం వల్లే ష్పా ఈ స్థాయిలో సక్సెస్ అయ్యారని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.