1.జగనన్న సురక్ష ప్రారంభం

జగనన్న సురక్ష కార్యక్రమాన్ని ఏపీ సీఎం జగన్ ప్రారంభించారు.పారదర్శకంగా పౌర సేవలు అందించడం మన ప్రభుత్వంలోనే సాధ్యమంటూ ఈ సందర్భంగా జగన్ వ్యాఖ్యానించారు.
2.పవన్ కళ్యాణ్ పై ప్రశాంత్ కుమార్ రెడ్డి విమర్శలు
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి యాత్రలో చేస్తున్న ప్రసంగాలపై వైసిపి ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి విమర్శలు చేశారు.చంద్రబాబు స్క్రిప్ట్ రాసిస్తే దాన్ని వారాహి ఎక్కి పవన్ చదువుతున్నాడని ఎద్దేవ చేశారు.
3.తెలంగాణలో గెలుస్తాం : రాహుల్ గాంధీ

తెలంగాణలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తాము తప్పకుండా గెలుస్తామని కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీ ధీమా వ్యక్తం చేశారు.
4.జగన్కు సీపీఐ రామకృష్ణ లేఖ
సీఎం జగన్ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మరోసారి లేఖ రాశారు.విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని కాపాడుకునేందుకు మాంగనీసు నది ఇసుక గనుల లీజు పొడిగించాలని కోరారు.
5.చిరుత దాడిలో చిన్నారికి గాయాలు

తిరుపతి చిరుత దాడిలో గాయపడిన చిన్నారికి పద్మావతి చిన్నపిల్లల ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతోంది.గత రాత్రి కుటుంబంతో కలిసి తిరుమలకు నడిచి వెళుతున్న మూడేళ్ల బాలుడు చిన్నారి కౌశిక్ పై చిరుత దాడి చేసింది.కౌశిక్ ను నోట్లో కరుచుకుని అడవిలోకి ఎత్తుకు వెళ్లేందుకు చిరుత ప్రయత్నించింది.కుటుంబీకులు స్థానికులు కేకలు పెట్టడంతో బాబును వదిలి అడవిలోకి వెళ్ళిపోయింది.
6.నేడు ఏపీ టెన్త్ సప్లమెంటరీ ఫలితాలు విడుదల
ఏపీలో టెన్త్ సప్లమెంటరీ పరీక్ష ఫలితాలు ఈరోజు ఉదయం 11 గంటలకు విడుదలయ్యాయి.
7.అంగప్రదక్షిణ టోకెన్లు విడుదల

ఈరోజు ఉదయం 10 గంటలకు అంగప్రదక్షిణ టోకెన్లను టీటీడీ విడుదల చేసింది .
8.తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు
ఏపీ తెలంగాణలో వర్షాలు కురుస్తున్నాయి. తెలంగాణకు ఎల్లో అలెర్ట్ జారీ అయింది.ఏపీలో పలుచోట్ల ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి.
9.రెండో రోజు సీఈసీ ప్రతినిధుల పర్యటన

తెలంగాణలో రెండో రోజు సీఈసీ ప్రతినిధులు పర్యటిస్తున్నారు.నేడు కలెక్టర్ సిఇసి ప్రతినిధులు సమీక్ష నిర్వహిస్తున్నారు.
10.విపక్షాల తొలి భేటీ
నేడు పట్టణాలు నితీష్ కుమార్ అధ్యక్షతన విపక్షాల తొలి భేటీ ప్రారంభమైంది.ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీ, మమత, అరవింద్ కేజ్రీవాల్ హాజరయ్యారు.
11.బట్టి విక్రమార్క పాదయాత్ర

నేడు నల్గొండ జిల్లా లో సీఎల్పీ నేత బట్టి విక్రమార్క పాదయాత్ర మొదలైంది.100వ రోజు నల్గొండ జిల్లా నకిరేకల్ నియోజకవర్గంలో పాదయాత్ర నిర్వహిస్తున్నారు.
12.వారాహి యాత్ర
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేపట్టిన వారాహి యాత్ర పదో రోజు కొనసాగుతోంది.అంబేద్కర్ కోనసీమ జిల్లా లో పవన్ యాత్ర కొనసాగుతోంది.
13.డీకే శివకుమార్ తో కోమటిరెడ్డి భేటీ

కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్ తో భవనగిరి కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి భేటీ అయ్యారు.
14.టీటీడీ చైర్మన్ కీలక వ్యాఖ్యలు
దళారి వ్యవస్థను రూపుమాపడానికి శ్రీవాణి ట్రస్టును పునరుద్ధరించామని , తిరుమల తిరుపతి దేవస్థానంలో అవినీతి చేయాలంటే ఎంతటి వాడైనా భయపడాల్సిందేనని ఆ సంస్థ చైర్మన్ వై వి సుబ్బారెడ్డి అన్నారు.
15.విశాఖలో మరో అత్యాధునిక క్రికెట్ స్టేడియం

విశాఖలో మరో అత్యాధునిక క్రికెట్ స్టేడియం ఏర్పాటు దిశగా అడుగులు వేయాలని ఏపీ సీఎం జగన్ అధికారులను ఆదేశించారు.
16.వన్యప్రాణుల రక్షణకు ‘ యూబీఐ ‘ ప్రత్యేక వాహనం
జిహెచ్ఎంసి తో పాటు, చుట్టుపక్క జిల్లాలో ఆపదలో తిప్పుకున్న వన్యప్రాణులు పక్షులను కాపాడేందుకు అటవీ శాఖ ప్రత్యేక రక్షణ వాహనం ను అందుబాటులోకి వచ్చింది.
కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద సచివాలయ కేంద్రంగా పనిచేస్తున్న యూనియన్ బ్యాంక్ శాఖ పది లక్షలతో దీనిని సమకూర్చింది.వన్య ప్రాణులను రక్షించేందుకు ప్రజలు 18004255364 నంబర్ కు సమాచారం అందించాలని కోరారు.
17.కేంద్రానికి కేటీఆర్ విజ్ఞప్తి

తెలంగాణ అభివృద్ధికి కేంద్రం సహకరించాలని మంత్రి కేటీఆర్ అన్నారు.
18.మూడోసారి కెసిఆర్ సీఎం కావడం ఖాయం
తెలంగాణలో మూడోసారి సీఎంగా కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేస్తారని గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు.
19.ప్రజలు నన్ను సీఎం కావాలనుకుంటున్నారు : కేఏ పాల్

ఏపీ రావణకాష్టంగా మారిందని, దీంతో ప్రజలు తనని సీఎం కావాలని కోరుకుంటున్నారని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు.
20.ఈరోజు బంగారం ధరలు
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 54,100
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 59,020
.