సింగర్ చిన్మయి పిల్లలను చూశారా ఎంత క్యూట్ గా ఉన్నారో.. వైరల్ అవుతున్న ఫోటోలు!

సినిమా ఇండస్ట్రీలో సింగర్ గా డబ్బింగ్ ఆర్టిస్ట్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి సింగర్ చిన్మయి శ్రీపాద(Chinmayi Sripada) ఇండస్ట్రీలో ఎంతో బిజీగా గడుపుతున్నారు.తన అద్భుతమైన గాత్రంతో ఎన్నో వందల పాటలను ఆలపించినటువంటి ఈమె ఎంతో మంది హీరోయిన్లకు డబ్బింగ్ చెబుతూ విపరీతంగా అభిమానులను సొంతం చేసుకున్నారు.

 Singer Chinmai Shared Adorable Photos Of Her Twin Babies Details, How Cute,chinm-TeluguStop.com

ఇలా కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నటువంటి ఈమె సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ అమ్మాయిల పట్ల జరిగే అన్యాయాలను ఎదిరిస్తూ సంచలన పోస్ట్ లు చేస్తుంటారు.

Telugu Baby Bump, Chinmayirahul, Rahul Ravinder, Chinmai, Chinmayi, Twin Baby Gr

ఇలా ఈమె అన్యాయాలను ఎదిరిస్తూ చేసే పోస్టులు కొన్నిసార్లు వైరల్ అవ్వడమే కాకుండా వాటి వల్ల ఈమె కూడా దారుణమైన ట్రోలింగ్స్ ఎదుర్కొంటున్నప్పటికీ ఈమె మాత్రం వెనకడుగు వేయడం లేదు.ఇక ఈమె వ్యక్తిగత జీవితం విషయానికి వస్తే 2014వ సంవత్సరంలో నటుడు రాహుల్ రవీందర్ (Rahul Ravinder) నుఈమె వివాహం చేసుకున్న సంగతి మనకు తెలిసిందే.ఇలా వివాహమైనటువంటి 8 సంవత్సరాలకు ఈ దంపతులకు కవల ఆడపిల్లలు(Twin baby Grils) జన్మించారు.

ఇక ఈమె తన ప్రెగ్నెన్సీ విషయాన్ని చెప్పకుండా సరాసరి తనకు పిల్లలు పుట్టారనే విషయం చెప్పడంతో సరోగసి ద్వారా పిల్లలను కన్నారు అంటూ పెద్ద ఎత్తున ఈమెపై విమర్శలు చేశారు.

Telugu Baby Bump, Chinmayirahul, Rahul Ravinder, Chinmai, Chinmayi, Twin Baby Gr

ఇలా సరోగసి ద్వారా పిల్లలను కన్నారంటూ వార్తలు రావడంతో వారికి వివరణ ఇచ్చుకున్నటువంటి ఈమె తన బేబీ బంప్ (Baby Bump) ఫోటోలను కూడా ఒకానొక సమయంలో షేర్ చేశారు.తనకు పిల్లలు పుట్టారన్న విషయాన్ని తెలియజేసినటువంటి ఈ దంపతులు ఇప్పటివరకు వారి మొహాలను మాత్రం అభిమానులకు చూపించలేదు.తాజాగా ఈ చిన్నారులకు మొదటి ఏడాది పూర్తి అయ్యి రెండవ సంవత్సరంలోకి అడుగుపెట్టిన సందర్భంగా తన ఇద్దరు పిల్లల క్యూట్ ఫోటోలను చిన్మయి సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ … ఇది ఒక గొప్ప ఆశీర్వాదం అంటూ క్యాప్షన్ పెట్టారు.

ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పిల్లలు చాలా క్యూట్ గా అందంగా ఉన్నారు అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube