అమెరికాకి దూరమవుతున్న అరబ్ దేశాలు.. ఆ భేటీయే నిదర్శనం..!

రష్యా, ఉక్రెయిన్( Russia ) దేశాల మధ్య యుద్ధం మొదలైన తర్వాత ప్రపంచ రాజకీయాలలో కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి.ముఖ్యంగా అరబ్ దేశాలలో వైఖరి మారుతోంది.

 Arab Countries Moving Away From America.. That Meeting Is The Proof..! , Interna-TeluguStop.com

ఇటీవల యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్, రష్యా అధ్యక్షుడు పుతిన్ అయిన భేటీయే ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది.

జూన్ 16న సెయింట్ పీటర్స్ బర్గ్‌లో యూఏఈ ప్రెసిడెంట్, పుతిన్ భేటీ అయ్యారు.

ఈ మీటింగ్‌లో పుతిన్ మొహమ్మద్ బిన్ జాయెద్‌ను పొగడటం హాట్ టాపిక్ అయ్యింది.యూఏఈని తమకు ఒక మంచి భాగస్వామిగా పుతిన్ కామెంట్స్ చేయడం కూడా చర్చినీయాంశమయ్యింది.

ఖైదీలను మార్చుకునే వ్యవహారంలో రష్యా, ఉక్రెయిన్, అమెరికా దేశాల మధ్య యూఏఈ ఎంతో హెల్ప్ చేసిందని పుతిన్ పేర్కొంటూ మొహమ్మద్ బిన్ జాయెద్‌కి కృతజ్ఞతలు తెలుపుకున్నారు.

Telugu America, Arab, International, Nri, Putin, Russia Ukraine, Zayed Al Nahyan

మరోవైపు ఇదే భేటీలో యూఏఈ అధ్యక్షుడు అల్-నహ్యాన్ ( Zayed Al Nahyan ) మాట్లాడుతూ ఉక్రెయిన్‌తో నెలకొన్న వివాదంపై చర్చలు జరపడానికి, రాజకీయ పరిష్కారాలు చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని అన్నారు.తర్వాత ఈ దేశ అధ్యక్షులు తమ దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం గురించి చర్చలు జరిపారు.ఇకపోతే ఉక్రెయిన్‌తో రష్యా యుద్ధం ప్రారంభించిన తరువాత కూడా మాస్కోకు నేరుగా దుబాయ్ విమానాలు నడిపింది.

Telugu America, Arab, International, Nri, Putin, Russia Ukraine, Zayed Al Nahyan

ఇదిలా ఉండగా ఉక్రెయిన్-రష్యా మధ్య జరుగుతున్న యుద్ధం గురించి కొన్ని యూరోపియన్ దేశాలు, అమెరికా తప్పితే వేరే దేశాలు అసలు పట్టించుకోవడం లేదు.మొన్నటిదాకా అమెరికాకు మిత్ర దేశాలుగా మెలిగిన సౌదీ అరేబియా, యూఏఈలు కూడా యుద్ధం విషయంలో నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నాయి. బైడెన్( Joe Biden ) యూఎస్ అధ్యక్ష పదవిని అధిరోహించిన అనంతరం సౌదీ రాజు మహ్మద్ బిన్ సల్మాన్ అమెరికా ఆధిపత్యాన్ని అసలు ఒప్పుకోవడం లేదు.

మరోవైపు సౌదీ అరేబియా, ఇరాన్ దేశాల మధ్య శత్రుత్వాన్ని తొలగించే వాటిని మిత్ర దేశాలుగా మార్చేందుకు చైనా బాగా కృషి చేస్తోంది.ఇంకోవైపు యూఏఈ, సౌదీలు ఇజ్రాయిల్‌తో స్నేహాన్ని పెంచుకుంటున్నాయి.

ఈ మొత్తం పరిస్థితులను పరిశీలిస్తుంటే అరబ్ దేశాలు అమెరికాకు దూరమవుతున్నాయని స్పష్టమవుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube