సూపర్ స్టార్ అభిమానులు మరియు సాధారణ ప్రేక్షకులు ఇంకా ఇండస్ట్రీ వర్గాల వారు ఎప్పుడెప్పుడా అంటూ ఆసక్తిగా ఎదురు చూసిన మహేష్ బాబు మరియు త్రివిక్రమ్ కాంబినేషన్ మూవీ టైటిల్ ని అధికారికంగా ప్రకటించారు.అమరావతికి అటు ఇటు అనే టైటిల్ ప్రధానంగా వినిపించిన విషయం తెలిసిందే.
కానీ ఆ టైటిల్ కాదని గుంటూరు కారం( Guntur Kaaram ) అనే టైటిల్ని కన్ఫర్మ్ చేయడం జరిగింది.మహేష్ బాబు వంటి సాఫ్ట్ ఇమేజ్ ఉన్న హీరో కి అది కూడా త్రివిక్రమ్ వంటి విభిన్నమైన క్లాస్ సినిమాల దర్శకుడు రూపొందించిన సినిమా కు గుంటూరు కారం వంటి టైటిల్ని పెట్టడం ఎంత వరకు కరెక్ట్ అంటూ కొందరు మీడియా వారు ముచ్చటించుకుంటున్నారు.
గుంటూరు కారం అని పెట్టగానే సినిమా కు మాస్ ట్యాగ్ లభిస్తుంది అని యూనిట్ సభ్యులు భావిస్తున్నారేమో కానీ ప్రేక్షకులు మరియు అభిమానులు మాత్రం మహేష్ బాబు( Mahesh babu ) వంటి స్టార్ హీరో కి ఇలాంటి చిన్న స్థాయి మాస్ టైటిల్ పెట్టడం ఏమాత్రం సరిగా లేదు అన్నట్లుగా కామెంట్స్ చేస్తున్నారు.
మరి కొందరు మహేష్ బాబు అభిమానులు మాత్రం గుంటూరు కారం టైటిల్ చాలా బాగుంది అంటూ మాట్లాడుకుంటున్నారు.త్రివిక్రమ్ శ్రీనివాస్ టైటిల్ విషయంలో గతంలో చాలా ఆలోచించే వారు.కానీ ఈసారి అంతగా ఆలోచించినట్లు అనిపించడం లేదు అంటూ కొందరు పెదవి విరుస్తున్నారు.
మొత్తానికి మహేష్ బాబు మరియు త్రివిక్రమ్ కాంబినేషన్ లో రాబోతున్న సినిమా కి గుంటూరు కారం అనే టైటిల్ కన్ఫమ్ అయ్యింది.
ఆ టైటిల్ కి ప్రేక్షకుల నుండి మిశ్రమ స్పందన లభిస్తుంది.వచ్చే సంవత్సరం సంక్రాంతి కి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే.పూజా హెగ్డే మరియు శ్రీలీల( Sreeleela ) హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమా మహేష్ బాబు ని సరి కొత్తగా చూపించబోతున్నట్లు యూనిట్ సభ్యులు నమ్మకంగా చెబుతున్నారు.
మరి ఈ సినిమా ఏ స్థాయి సక్సెస్ ని సొంతం చేసుకుంటుంది.ఆ సక్సెస్ లో సినిమా టైటిల్ పాత్ర ఎంత ఉంటుంది అనేది తెలియాలంటే మరికొన్ని నెలలు వెయిట్ చేయాల్సిందే.