బాలీవుడ్ లో తెరి రీమేక్ హీరో ఎవరంటే..?

ఒక భాష లో ఒక సినిమా సూపర్ హిట్ అయిందంటే చాలు మరో భాషలో దాన్ని రీమేక్ చేయాలని చూస్తారు వీలైతే రీమేక్ చేసి మంచి సక్సెస్ కూడా కొడుతారు.అయితే ఒక సినిమా వచ్చిందంటే దాన్ని వేరే భాషలోకి రీమేక్ చేయడానికి మహా అయితే ఓ సంవత్సరం పట్టొచ్చు.

 Who Is The Teri Remake Hero In Bollywood, Pawan Kalyan , Varun Dhawan, Teri, Vij-TeluguStop.com

కానీ ఏడేళ్ల తర్వాత ఓ సినిమా రీమేక్‌ అవుతోంది అంటే చాలా స్పెషల్‌ అని చెప్పొచ్చు.ఒరిజినల్‌ కథలో విషయం బాగుండాలి, లేదంటే ఆ రీమేక్‌ కోసం ఇక్కడ ఎక్కవమంది వెయిట్‌ చేస్తుండాలి.

ప్రస్తుతం టాలీవుడ్‌లో( Tollywood ) ఓ సినిమా తెరకెక్కుతోంది.అదే ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌( Ustad Bhagat Singh ).ఇప్పుడు ఇదే సినిమా బాలీవుడ్‌లో కూడా తెరకెక్కుతోంది.

 Who Is The Teri Remake Hero In Bollywood, Pawan Kalyan , Varun Dhawan, Teri, Vij-TeluguStop.com

విజయ్‌ – అట్లీ( Vijay – Atlee ) కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం తెరి( teri ) అందులో విజయ్‌ పోలీసు అధికారిగా అదరగొట్టాడు.

అదే సినిమా తెలుగులో ‘పోలీసోడు అనే పేరుతో థియేటర్లలో విడుదలైంది.ఆ సమయంలో టైటిల్‌తో కాస్త ఇబ్బందిపడి.వైరల్‌ కూడా అయ్యింది.అయితే ఆ సినిమాకు మన దగ్గర సరైన ఫలితం రాలేదు.

ఇప్పుడు అదే సినిమాను ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’గా తీస్తున్నారు అని అంటున్నారు.అయితే ఈ సినిమా రీమేక్‌ అనే విషయం మాత్రం టీమ్‌ అధికారికంగా చెప్పడం లేదు.

Telugu Bollywood, Harish Shankar, Pawan Kalyan, Teri, Varun Dhawan, Vijay Atlee,

ఒరిజినల్ వెర్షన్ నుండి ప్లాట్‌ను తీసుకొని… వీలైనంతవరకు పోలికలు రాకుండా హరీష్ శంకర్( Harish Shankar ) ఈ సినిమాను తీర్చిదిద్దుతున్నట్టు సమాచారం.అందుకే ఇటీవల విడుదలైన గ్లింప్స్‌లో ఈ వివరాలు, పోలికలు అస్సలు కనిపించలేదు అని అంటున్నారు.ఇప్పుడు అదే సినిమాను హిందీలోకి తీసుకెళ్తున్నారని సమాచారం.అయితే అక్కడ కొత్త దర్శకుడు కాకుండా తమిళంలో చేసిన అట్లీనే ఈ సినిమా కూడా చేస్తారట.దీని కోసం బాలీవుడ్‌లో వరుణ్‌ ధావన్‌( Varun Dhawan ) ఓకే అయ్యారని టాక్‌.

Telugu Bollywood, Harish Shankar, Pawan Kalyan, Teri, Varun Dhawan, Vijay Atlee,

అట్లీ ప్రస్తుతం షారుఖ్ ఖాన్‌తో ‘జవాన్’ సినిమాను చేస్తున్నారు.ఈ సినిమా పూర్తవ్వగానే అట్లీ తమిళంలో ఓ సినిమా చేస్తారు అని అంటున్నారు.దీని తర్వాత ‘తెరి’ హిందీ రీమేక్‌ ఉంటుంది అని చెప్పొచ్చు.

ఇక ప్రస్తుతం నార్త్ లో ఎక్కువ గా సౌత్ సినిమాలే రీమేక్ చేస్తున్నారు అక్కడి మేకర్స్…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube