కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఓటింగ్ కొనసాగుతోంది.ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఓటింగ్ సాయంత్రం 6 గంటల వరకు జరగనుంది.
రాష్ట్రంలోని మొత్తం 224 నియోజకవర్గాలకు ఒకే విడతలో పోలింగ్ నిర్వహిస్తున్నారు.కాగా 58,545 పోలింగ్ కేంద్రాల్లో ఈ ఓటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది.
ఈ క్రమంలో ఆ సమయం వరకు క్యూలైన్లలో నిల్చున్న వారికి ఓటు వేసే అవకాశాన్ని కల్పించనున్నారు అధికారులు.కాగా మొత్తం నియోజకవర్గాలకు గానూ 2,615 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.
ప్రజలతో పాటు పలువురు ప్రముఖులు ఇప్పటికే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.బెంగళూరులోని శాంతినగర్ లో నటుడు ప్రకాశ్ రాజ్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.
అదేవిధంగా శికారీపురాలో మాజీ సీఎం యడియూరప్ప, బెంగళూరులో ఇన్ఫోసిస్ నారాయణమూర్తి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.