తమిళ దర్శకుడు వెంకట ప్రభు (Venkat Prabhu) తెరకెక్కించిన తాజా చిత్రం కస్టడీ( Custody ).ఈ సినిమాలో నాగచైతన్య( naga chaitanya ) కృతి శెట్టి ( Krithi Shetty ) హీరో హీరోయిన్ లుగా నటించిన విషయం తెలిసిందే.
ఈ సినిమా ఈ నెల 12వ తేదీన తెలుగు తమిళ భాషల్లో ఒకేసారి విడుదల కానున్న విషయం తెలిసిందే.కాక తమిళంలో నాగచైతన్య పరిచయం కాబోతున్న మొదటి సినిమా కావడంతో ఈ సినిమాను తమిళంలో కూడా బాగా ప్రమోట్ చేస్తున్నారు మూవీ మేకర్స్.
ఈ సినిమా ప్రచారంలో భాగంగా తాజాగా దర్శకుడు వెంకట ప్రభు తెలుగు మీడియాతో ముచ్చటించారు.ఈ సందర్భంగా వెంకట ప్రభువు మాట్లాడుతూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.ఈ సినిమా కథ ఆలోచన కరోనా సమయంలో వచ్చింది.కరోనా మహమ్మారి సమయంలో ఈ సినిమా కథ రాసుకున్నాను.ఈ కథ ఆలోచనకు మలయాళ సినిమా నయట్టు స్ఫూర్తిని ఇచ్చింది అని తెలిపారు.మలయాళ కథలో లేని కమర్షియల్ ఎలిమెంట్స్‌ను కస్టడీ సినిమా లో తాను జత చేశాను అని చెప్పుకొచ్చారు వెంకట ప్రభు.తెలుగు, తమిళ ప్రేక్షకుల కోసం చేసే సినిమాల్లో కమర్షియల్ ఎలిమెంట్స్ ఉండాలి.
పెద్ద ఆశయాలతో ఉన్న ఒక సాధారణ కానిస్టేబుల్ కథ చెప్పాలనేది నా ఆలోచన.ఆ ఆలోచనలతో కస్టడీ కథ పుట్టింది అని తెలిపారు.
నాగచైతన్య నటించిన లవ్ స్టొరీ సినిమాలో ఒక పాట చూశాను.
అందులో నాగచైతన్య నేను అనుకున్న పాత్రకు సరిగ్గా సరిపోతాడు అనిపించింది.నాగచైతన్యకు కథ చెప్పాను.ఆయనకి చాలా నచ్చింది అని వెంకట్ ప్రభు చెప్పుకొచ్చారు.
ఇకపోతే కస్టడీ సినిమా విషయానికి వస్తే.ఇప్పటికే ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి.
ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.కాగా ఇటీవల విడుదలైన ఏజెంట్ సినిమా డిజాస్టర్ కావడంతో అక్కినేని అభిమానులు ఆశలన్నీ కూడా కస్టడీ సినిమాపై పెట్టుకున్నారు.