తాజాగా హైదరాబాద్- కోల్ కత్తా ( Hyderabad- Kolkata )మధ్య జరిగిన మ్యాచ్ చివరి బంతి వరకు ఉత్కంఠ భరితంగా సాగింది.ఈ మ్యాచ్ లో గెలిచే అవకాశాలను గల్లంతు చేసుకొని ఓడిపోయి హైదరాబాద్ జట్టు తీవ్ర విమర్శలను ఎదుర్కొంటోంది.మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కోల్ కత్తా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 171 పరుగులు చేసింది.172 పరుగుల లక్ష్య చేధనకు దిగిన హైదరాబాద్ జట్టు ఐదు పరుగుల తేడాతో ఓటమిని చవిచూసింది.హైదరాబాద్ జట్టు మొదటి ఆరు ఓవర్ల వరకు నిలకడగా రాణించి, ఆ తర్వాత వరుస వికెట్లను కోల్పోతూ వచ్చింది.కానీ మధ్యలో జట్టు కెప్టెన్ మార్ క్రామ్( Captain Mar Cram ) మరియు క్లాజెన్లు కాసేపు క్రీజు లో నిలబడి రాణిస్తూ ఉంటే మ్యాచ్ సులువుగా గెలిచే అవకాశాలు కనిపించాయి.
వీరిద్దరి అవుట్ తర్వాత జట్టు మళ్లీ కష్టాల్లో పడింది.హైదరాబాద్ జట్టు బ్యాటర్లు ఎంతో కష్టపడి చివరి ఓవర్ వరకు మ్యాచ్ ను తీసుకువచ్చారు.ఇక ఆరు బంతుల్లో 9 పరుగులు చేస్తే హైదరాబాద్ జట్టు విజయం సాధిస్తుంది.గ్రౌండ్ లో ఉండే ప్రేక్షకులంతా హైదరాబాద్ జట్టు దే విజయం అని భావించారు.
ఎందుకంటే స్ట్రైకింగ్ లో అబ్దుల్ సమద్( Abdul Samad ) ఉన్నాడు.ఆఖరి ఓవర్లో ఒక ఫోర్ లేదా ఒక సిక్స్ పడితే హైదరాబాద్ గెలిచినట్టే.ఇక మొదటి బంతికి అబ్దుల్ సమద్ సింగిల్ తీస్తే, రెండవ బంతికి భువనేశ్వర్ కుమార్( Bhuvneshwar Kumar ) సింగిల్ తీశాడు.మూడవ బంతికి సిక్స్ కొట్టే ప్రయత్నం చేసి అబ్దుల్ సమాద్ వికెట్ సమర్పించుకున్నాడు.
దీంతో హైదరాబాద్ ఆశలు గల్లంతయ్యాయి.గెలిచే మ్యాచ్ ఓడిపోతుందని ఎవరు ఊహించలేదు.
చివరి మూడు బంతులకు ఏడు పరుగులు చేయాల్సి ఉంది.అయితే మూడు బంతులకు రెండు పరుగులు చేసి ఐదు పరుగుల తేడాతో ఓడిపోవడంతో హైదరాబాద్ జట్టుపై క్రికెట్ అభిమానులు సోషల్ మీడియా వేదికగా విమర్శలు చేస్తున్నారు
.