రష్యా – ఉక్రెయిన్( Russia – Ukraine ) యుద్ధం మొదలై నేటికి 15 నెలలు కావస్తోంది.అయినా, ఇరుదేశాలు నిరాటంకంగా పోరాడుతున్నాయి.
రోజుల వ్యవధిలోనే ముగిసిపోతుంది అనుకున్న ఈ యుద్ధం కాస్త సంవత్సరం పైనే జరుగుతుండడం దురదృష్టకరం.ఈ యుద్ధంలో రష్యాదే పైచేయిగా ఉందనే విషయం తెలిసినదే.
అయితే అలాంటి రష్యా తాజాగా ఉక్రెయిన్ ని ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేయడం ఇపుడు పెను సంచలం అయింది.
విషయం ఏమంటే, తమ దేశాధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను( Vladimir Putin ) హత్య చేసేందుకు ఉక్రెయిన్( Ukraine ) కుట్ర పన్నిందని, ఈ క్రమంలో ఈ మంగళవారం రాత్రి పుతిన్ కార్యాలయంపై 2 డ్రోన్‌లతో ఉక్రెయిన్ దాడులు చేసిందని రష్యా ఆరోపించింది.అయితే వాటిని పసిగట్టి తమ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ద్వారా కుట్రను భగ్నం చేశామని అన్నారు.ఇక పుతిన్ తృటిలో తప్పించుకున్నట్టు కూడా చెప్పుకొచ్చారు.
కాగా రష్యా ఆరోపణలు ప్రస్తుతం అంతర్జాతీయంగా కలకలం సృష్టిస్తున్నాయి.మరోవైపు క్రెమ్లిన్‌పై దాడిని ప్లాన్డ్ టెర్రరిస్ట్ అటాక్‌గా ఆర్ఐఏ నివేదించడం కొసమెరుపు.ఈ నేపథ్యంలో పుతిన్‌కు ఎలాంటి గాయాలు కాలేదని.అధ్యక్ష భవనానికి కూడా ఎటువంటి నష్టం వాటిల్లలేదని క్రెమ్లిన్ వెల్లడించింది.రెండు మావనరహిత విమానాలు క్రెమ్లిన్‌ను లక్ష్యంగా చేసుకున్నాయని.అయితే రాడార్ వార్ ఫేర్( Radar War Fare ) సిస్టమ్స్‌తో సైన్యం అప్రమత్తంగా వుండటంతో వీటి ప్రయత్నం ఫలించలేదని వెల్లడించింది.
ఈ చర్యను తీవ్రంగా పరిగణించిన రష్యాకు ఎప్పుడు ఎక్కడ ఎలా సమాధానం చెప్పాలో తెలుసునని పేర్కొంది.