ఆ టార్చర్ నుంచి బయట పడటానికి ఇలా చేస్తున్నా... సమంత పోస్టు వైరల్!

టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ సమంత( Samantha ) ప్రస్తుతం సిటాడెల్( Citadel ) వెబ్ సిరీస్ లో నటిస్తున్నారు.ప్రస్తుతం ఈ వెబ్ సిరీస్ శరవేగంగా షూటింగ్ పనులు జరుపుకుంటుంది.

 I Am Doing This To Get Out Of That Torture Samanthas Post Is Viral, Ice Bath, Sh-TeluguStop.com

సమంత, వరుణ్ ధావన్ జంటగా ఈ సిరీస్ లో నటిస్తున్నారు.రాజ్ అండ్ డీకే ఈ వెబ్ సిరీస్ కి దర్శకత్వం వహిస్తున్నారు.

ఇక ఈ వెబ్ సిరీస్ కోసం సమంత భారీ స్థాయిలో కష్టపడుతున్నారు.ఇందులో యాక్షన్ సీక్వెన్ కోసం సమంత మార్షల్ ఆర్ట్స్ లో కూడా శిక్షణ తీసుకున్నారు.

ఇలా ఎప్పటికప్పుడు ఈ వెబ్ సిరీస్ కోసం తాను పడుతున్న కష్టంతోపాటు ఈ వెబ్ సిరీస్ కి సంబంధించిన అప్డేట్స్ కూడా విడుదల చేస్తున్నారు.

ఇకపోతే తాజాగా సమంత ఐస్ బాత్( Ice Bath ) లో ఉన్నటువంటి ఒక ఫోటోని షేర్ చేశారు.ఇలా ఐస్ టబ్ లో సమంత కూర్చుని ఉన్నటువంటి ఈ ఫోటోని షేర్ చేస్తూ.ఇది టార్చర్ సమయం అంటూ చెప్పుకొచ్చారు.

ఇలా ఎందుకు కూర్చున్నారనే విషయానికి వస్తే ఈమె నటిస్తున్న ఈ వెబ్ సిరీస్ యాక్షన్ సీక్వెన్స్ తో ఉండటంవల్ల వాటి నుంచి ఉపశమనం పొందడం కోసమే సమంత ఇలా ఐస్ టబ్ లో కూర్చున్నట్లు వెల్లడించారు.ప్రస్తుతం సమంత షేర్ చేసిన ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

సాధారణంగా మనం ఒక ఐస్ క్యూబ్ పట్టుకుంటేనే ఎక్కువసేపు ఉండలేము అలాంటిది సమంత ఇలా ఐస్ టబ్ లో ఇలా కూర్చోవడంతో ఈ సిరీస్ కోసం సమంత ఎంతలా కష్టపడుతున్నారో అర్థం చేసుకోవచ్చు.అయితే తాజాగా సమంత నటించిన శాకుంతలం ( Shaakuntalam ) సినిమా డిజాస్టర్ అయింది.ఇక ఈమె ఈ వెబ్ సిరీస్ తో పాటు విజయ్ దేవరకొండ ( Vijay Devarakonda) హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో ఖుషి ( Kushi ) సినిమాలో నటిస్తున్నారు.ప్రస్తుతం ఈ సినిమా కూడా షూటింగ్ పనులు జరుపుకుంటుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube