డైరెక్టర్ గుణశేఖర్( Director Gunasekhar ) దర్శకత్వంలో పాన్ ఇండియా లెవెల్ లో రూపొందిన సినిమా శాకుంతలం.( Shaakuntalam ) ఇందులో స్టార్ హీరోయిన్ సమంత, దేవ్ మోహన్, అల్లు అర్హ, మోహన్ బాబు తదితరులు నటించారు.ఇక ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందించగా.నీలిమ గుణ ఈ సినిమాకు నిర్మాతగా బాధ్యతలు చేపట్టారు.ఇక శేఖర్ వి.జోసెఫ్ సినిమాటోగ్రఫీ బాధ్యతలు చేపట్టాడు.ఇక ఈ సినిమా మహాభారతంలోని ఓ ప్రేమ కథ ఆధారంతో రూపొందించాడు డైరెక్టర్.ఇక మూడు సంవత్సరాలుగా ఈ సినిమా షూటింగును జరపగా కొంతవరకు ఈ సినిమాపై అంచనాలు వెలువడ్డాయి.
ఇక ఈ సినిమా ఇప్పటికే చాలాసార్లు విడుదలకు వాయిదా పడింది.మొత్తానికి ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది.మరి ఈ సినిమా ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుందో.సమంతకు( Samantha ) ఎటువంటి సక్సెస్ అందించిందో చూద్దాం.
కథ:
కథ విషయానికి వస్తే.శాకుంత పక్షులు ఒక పసి బిడ్డని తీసుకొని వచ్చి ఒకచోట వదిలేస్తాయి.
ఇక ఆ పసి బిడ్డను వదిలేసిన ప్రాంతానికి దగ్గరలో కన్వముని (కృష్ణంరాజు) ఆశ్రమం ఉంటుంది.ఇక ఆ మునికి ఆ పసిబిడ్డ దొరకటంతో ఆ పాపను పెంచి పెద్ద చేస్తారు.
శకుంతల (సమంత) అని పేరు కూడా పెడతారు.ఇక ఓసారి పులిని వేటాడుతూ దుష్యంత (దేవ్ మోహన్) రాజు కన్వముని ఆశ్రమం దగ్గరికి వస్తాడు.
ఇక దుష్యంత రాజు అక్కడున్న శకుంతలాన్ని చూసి ఇష్టపడతాడు.మొదటి చూపులోనే ప్రేమలో పడతాడు.
శకుంతల కూడా దుష్యంతుడిని ఇష్టపడుతుంది.అలా ఆ తర్వాత వీరిద్దరి జీవితాలలో కొన్ని సంఘటనలు ఎదురవుతాయి.
ఇంతకు ఆ సంఘటనలు ఏంటివి.చివరికి వారిద్దరు కలుస్తారా లేదా అనేది మిగిలిన కథలోనిది.
నటినటుల నటన:
ఇక సమంత నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ఏ పాత్రలోనైనా అద్భుతంగా నటిస్తుంది.ఇప్పటివరకు కనిపించని పాత్రతో ఈ సినిమాలో కనిపించింది.హీరో దేవ్ మోహన్( Dev Mohan ) కూడా ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు.ఇక మిగతా నటీనటులంతా బాగానే చేశారు.
టెక్నికల్:
టెక్నికల్ విషయానికి వస్తే.డైరెక్టర్ కథను ఈ తరం ప్రేక్షకులను ఆకట్టుకున్న విధంగా చూపించడంలో విఫలమయ్యాడని చెప్పాలి.మణిశర్మ పాటలు కూడా పరవాలేదు అన్నట్లుగా ఉన్నాయి.ఎక్కడో రెండు మూడు సన్నివేశాలు 3d ఎఫెక్ట్ గా కనిపించాయి.ఇక మిగతా టెక్నికల్ విభాగాలు సినిమాకు తగ్గట్టుగా పనిచేశాయి.
విశ్లేషణ:
ఈ సినిమా ఒక మంచి ప్రేమ కథ.ఇక ట్విస్టులు వంటివి అంతగా ఉండవు.మహాభారతం, రామాయణం వంటి పురాణాలు ఇష్టపడే వాళ్లకు ఈ కథ బాగా నచ్చుతుంది.కానీ ఈ తరం ప్రేక్షకులు మాత్రం సినిమాలలో కొత్తదనాన్ని వెతుకుతున్నారు.ఇక డైరెక్టర్ మాత్రం ఒక్కో విషయాన్ని వివరించి చూపించారు.కానీ ఎందుకో అంతగా వర్క్ అవుట్ కానట్టు అనిపించింది.అలా కథ మొత్తం ఒక ఫ్లోలో వెళ్తున్నట్లు అనిపించింది.
ప్లస్ పాయింట్స్:
సమంత నటన, గుణశేఖర్ డైరెక్షన్, కొన్ని కొన్ని సన్నివేశాలు.
మైనస్ పాయింట్స్:
లాజిక్ మిస్ అవ్వటం, కొన్ని సన్నివేశాలు బోరుగా అనిపించాయి, పాటలు అంతంతగానే అనిపించాయి.
బాటమ్ లైన్:
చివరగా చెప్పాల్సిందేంటంటే.ఈ సినిమా ఈ తరం ప్రేక్షకులను అంతగా ఆకట్టుకపోవచ్చు.కారణం ఏంటంటే మాస్, మంచి యాక్షన్ లను ఇష్టపడే ప్రేక్షకులు ఇటువంటి ఫ్లోగా వెళ్లే లవ్ స్టోరీలను అంతగా చూడటానికి ఇష్టపడరు.
ఈ సినిమా ఒక్కసారి చూస్తే చాలు అన్నట్లు ఉండగా.సమంతకు మాత్రం కాస్త నిరాశనే అని చెప్పవచ్చు.