ఆ సినిమా వల్లే సిల్క్ స్మిత అప్పుల పాలయ్యారా.. బయట అలా ఉండేవారంటూ?

టాలీవుడ్ ఇండస్ట్రీలో నటిగా, ప్రొడ్యూసర్ గా, ఫైనాన్షియర్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్న వాళ్లలో కాకినాడ శ్యామల( kakinada syamala ) ఒకరు.200కు పైగా సినిమాలలో నటించిన ఈ నటి ఎన్నో విజయాలను ఖాతాలో వేసుకున్నారు.ఈ మధ్య కాలంలో వరుసగా ఇంటర్వ్యూలు ఇవ్వడం ద్వారా వార్తల్లో నిలుస్తున్న కాకినాడ శ్యామల షాకింగ్ విషయాలను వెల్లడించగా ఆ విషయాలు తెగ వైరల్ అవుతున్నాయి.

 Kakinada Syamala Comments About Silk Smitha Details Here Goes Viral , Kakinada-TeluguStop.com

ప్రముఖ నటి సిల్క్ స్మిత( Silk Smita ) జీవితం గురించి కాకినాడ శ్యామల మాట్లాడుతూ తాను ఫైనాన్షియర్ కావడంతో చాలా సినిమాలకు ఫైనాన్స్ చేశానని ఆమె చెప్పుకొచ్చారు.సిల్క్ స్మిత సొంతంగా చేసిన ఒక సినిమా కోసం కూడా తాను డబ్బు విషయంలో సహాయం చేయడం జరిగిందని కాకినాడ శ్యామల కామెంట్లు చేశారు.అయితే తాను సిల్క్ స్మితకు ఫైనాన్స్ ఇచ్చిన ఆ ఒక్క సినిమా సరిగ్గా ఆడలేదని ఆమె అభిప్రాయం వ్యక్తం చేశారు.

ఆ సినిమా డిజాస్టర్ రిజల్ట్ ను అందుకోవడం వల్ల సిల్క్ స్మిత అప్పులపాలయ్యారని కాకినాడ శ్యామల చెప్పుకొచ్చారు.సినిమాల్లో స్క్రీన్ పై కనిపించే సిల్క్ స్మితకు రియల్ లైఫ్ సిల్క్ స్మిత( Real Life Silk Smita )కు చాలా వ్యత్యాసం ఉందని ఆమె అభిప్రాయం వ్యక్తం చేశారు.సిల్క్ స్మిత ఆత్మహత్య చేసుకుందని కొంతమంది చెబితే హత్య చేశారని మరి కొందరు చెబుతారని నిజానిజాలు దేవుడికే తెలియాలని కాకినాడ శ్యామల అభిప్రాయం వ్యక్తం చేశారు.

ఏ రీజన్ వల్ల సిల్క్ స్మిత చనిపోయారో ఇప్పటికీ సరైన కారణాలు అయితే తెలియవని ఆమె కామెంట్లు చేశారు.సిల్క్ స్మిత చేసిన అప్పులను మాత్రం తిరిగి చెల్లించిందని కెరీర్ బాగానే ఉన్న సమయంలో ఆమె ఆత్మహత్య చేసుకోవడం జరిగిందని కాకినాడ శ్యామల చెప్పుకొచ్చారు.ఆమె వెల్లడించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube