రోజుకు 65 లీటర్ల పాలిచ్చే ఆవు, రూ.10కోట్లు విలువచేసే దున్నపోతు ఒకేచోట!

అవును, ఇది అబద్ధం కాదు.మీరు విన్నది నిజమే.

 National Animal Pair Muzaffarnagar Cow Giving 65 Liters Milk Buffalo Worth 10 Cr-TeluguStop.com

డైరెక్ట్ గా విషయంలోకి వెళ్ళిపోదాం రండి.ఇండియాలోనే అతిపెద్ద జంతు ప్రదర్శన ఉత్తరప్రదేశ్‌లోని ( Uttar Pradesh ) ముజఫర్‌నగర్‌లో ఏప్రిల్ 6, 7 తేదీల్లో నిర్వహించడం జరిగింది.

ఈ ప్రదర్శనలో దేశం నలుమూలల నుండి ఆవులు, గేదెలు, ఎద్దులు, మేకలు, గుర్రాలు, గొర్రెలు వంటి జంతువులను యజమానులు పోటీకి తోలుకు వచ్చారు.గెలుపొందిన జంతువులు వరుసగా రూ.5 లక్షలు, రూ.2 లక్షలు,రూ.1 లక్ష రివార్డులు ఇక్కడ అందుకోవడం విశేషం.

ఈ కార్యక్రమంలో భాగంగా మొత్తం 18 రకాల జంతువులకు ప్రైజ్ మనీగా దాదాపు రూ.50 లక్షలు పంపిణీ చేసారు నిర్వాహకులు.కాగా ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌లో ఇంత పెద్ద ఎత్తున జంతుప్రదర్శన నిర్వహించడం ఇదే తొలిసారి కావడం విశేషం.

దాంతో దీనికి బాగా అక్కడ పేరు వచ్చింది.ఈ ప్రదర్శనను కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్​ గడ్కరీ ప్రారంభించడం విశేషం.

కాగా ఈ నేషనల్ యానిమల్ ఎగ్జిబిషన్‌లో ర్యాప్‌లో షేరా మేక, కరిష్మా గేదె క్యాట్‌వాక్ సందర్శకులను ఆకట్టుకుంది.ఇక్కడ జంతువుల అందాన్ని చూసి ప్రజలు చప్పట్లతో హోరెత్తించారు.

ఈ క్రమంలోనే రూ.10 కోట్ల విలువ గల ఓ దున్నపోతు ఈ ప్రదర్శనలో పాల్గొని అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.అంతే కాకుండా రోజుకు 65 లీటర్ల పాలిచ్చే హైబ్రిడ్​ ఆవు( Hybrid Cow ) కూడా మరో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.ఈ ఆవు రోజుకు 3 సార్లు పాలు ఇస్తుందని ఈ క్రమంలో 65 లీటర్ల వరకు పాలు ఇస్తుందని యజమాని తెలిపాడు.దీని ధర రూ.5 లక్షలకు పైగా ఉంటుందని కూడా ఈ సందర్భంగా చెప్పాడు.వీటితో పాటు ఈ ప్రదర్శనలో హరియాణాకు చెందిన ఆవులు, గేదెలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.దేశం నలుమూలల నుంచి దాదాపు 1200 పశువులతో పాటు 50 వేల మంది రైతులు, పశుకాపరులు ఇక్కడ రావడం జరిగింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube