రాజన్న సిరిసిల్ల జిల్లా: భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగ చేపట్టినటువంటి పల్లె పల్లె కి ఓ బి సి ఇంటి ఇంటికి బిజెపి కార్యక్రమంను ఎల్లారెడ్డిపేట మండలంలోని నారాయణపూర్ గ్రామంలో ఓబీసీ మోర్చా మండల అధ్యక్షుడు బొమ్మడి స్వామి ఆధ్వర్యంలో ప్రారంభించడం జరిగింది.
ఈ సందర్భంగా వారు గ్రామ ప్రజలకు గత తొమ్మిది సంవత్సరాలుగా బిజెపి ప్రభుత్వం ఓబీసీలకు చేసినటువంటి అభివృద్ధికి సంబంధించిన కార్యక్రమాలు తెలియజేయడం జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర ఓబిసి కార్యవర్గ సభ్యులు బర్కం నవీన్ యాదవ్,బిజెపి సీనియర్ నాయకులు కంచర్ల పరశురాములు,దుమాల దేవయ్య,మండల ఉపాధ్యక్షుడు వంగల్ రాజు, బీజేవైఎం నాయకులు శీతాల సాగర్, గ్రామ ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.