టాలీవుడ్ ఇండస్ట్రీలో నటిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న సమంత( Samantha ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ప్రస్తుతం ఈమె శాకుంతలం( Shaakunthalam ) సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో ఎంతో బిజీగా ఉన్నారు.
ఇలా ఒకవైపు ప్రమోషన్ కార్యక్రమాలను చేపడుతూనే మరోవైపు తాను కమిట్ అయిన సినిమాలు వెబ్ సిరీస్ ల షూటింగులలో ఎంతో బిజీగా గడుపుతున్నారు.హాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రియాంక చోప్రా( Priyanka Chopra ) నటించిన సిటాడెల్( Citadel ) వెబ్ సిరీస్ ను ఇండియన్ వెర్షన్ లో అదే పేరుతో తెరకెక్కిస్తున్న విషయం మనకు తెలిసిందే.
ఇక ఈ వెబ్ సిరీస్ కు రాజ్ అండ్ డీకే దర్శకత్వం వహిస్తున్నారు.
ఈ క్రమంలోనే ఈ వెబ్ సిరీస్ గురించి తాజాగా నటి ప్రియాంక చోప్రా మాట్లాడుతూ పలు విషయాలను తెలియజేశారు.ఇందులో సమంత బాలీవుడ్ నటుడు వరుణ్ ధావన్( Varun Dhavan ) జంటగా నటిస్తున్న విషయం మనకు తెలిసిందే.ఈ సందర్భంగా ప్రియాంక చోప్రా మాట్లాడుతూ తాను గత కొద్ది రోజుల క్రితం వరుణ్ ధావన్ ను కలిసి ఈ సిరీస్ గురించి మాట్లాడగా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ పనులు జరుగుతున్నాయని తెలియజేశారు.
ఈ ఇండియన్ వెర్షన్ వెబ్ సిరీస్ కోసం తాను ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నానని ఈ సందర్భంగా ప్రియాంక చోప్రా తెలిపారు.
ఇక హాలీవుడ్ సిరీస్ లో ప్రియాంక చోప్రా నటించగా ఇండియన్ వెర్షన్ లో మాత్రం ప్రియాంక చోప్రా పాత్రలో సమంత నటిస్తున్న విషయం మనకు తెలిసిందే.అయితే సమంత గురించి ప్రియాంక చోప్రా మాట్లాడుతూ సమంత అద్భుతమైన ఒక గొప్ప నటి, ఆమెకు నటన విషయంలో ఎలాంటి సలహాలు సూచనలు ఇవ్వాల్సిన అవసరం లేదని ఈ సందర్భంగా ప్రియాంక చోప్రా తెలియజేశారు.ఇక ఈ సిరీస్ రాజ్ అండ్ డీకే డైరెక్షన్ లో తెరకెక్కుతోంది.
వారిద్దరూ ఎంతో అద్భుతమైన డైరెక్టర్లు అంటూ ఈమె ఈ సిరీస్ గురించి ఈమె చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.ఇక ఈ సిరీస్ కోసం సమంత ఎంతో కష్టపడుతున్న విషయం మనకు తెలిసిందే.
ప్రత్యేకంగా మార్షల్ ఆర్ట్స్ శిక్షణ కూడా తీసుకొని ఈ సిరీస్ షూటింగ్లో పాల్గొంటున్నారు.