రేపు సీఎం జగన్ దెందులూరు పర్యటన..!!

ఏపీ సీఎం వైఎస్ జగన్( CM Jagan ) రేపు దెందులూరులో పర్యటించనున్నారు.ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో జిల్లా నేతలు స్థానిక ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరి( MLA Kotharu Abbayya Choudary ) మరియు ప్రభుత్వ అధికారులు భారీ బందోబస్తు ఏర్పాటు పర్యవేక్షించడం జరిగింది.

 Tomorrow Cm Jagan Dendulur Visit Here Full Details, Cm Jagan, Dendulur Visit, J-TeluguStop.com

ఈ క్రమంలో జిల్లా ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…05 అదనపు ఎస్పీలు, 16 మంది డిఎస్పీలు, 29 మంది సిఐలు 85 మంది ఎస్ఐలు, 270 మంది ఏఎస్ఐ, హెడ్ కానిస్టేబుల్స్, 462 హెడ్ కానిస్టేబుల్స్ కానిస్టేబుళ్ల 107 మహిళా హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుల్ 265 మంది మహిళా హోం గార్డ్స్ బందోబస్తు ఉంటుందన్నారు.

పొదుపు సంఘాల అక్కచెల్లెళ్లకు “వైయస్సార్ ఆసరా”( YSR Asara ) మూడో విడత కార్యక్రమాన్ని జగన్ ప్రారంభించనున్నారు.ఈ సందర్భంగా సభ వేదికను అధికారులతో పాటు స్థానిక ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరి దగ్గరుండి పర్యవేక్షించారు.పోలీసులు పట్టిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.రేపు ఉదయం 10 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి సీఎం జగన్ బయలుదేరి ఉదయం 10:30 గంటలకు దెందులూరు చేరుకుంటారు.అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వైయస్సార్ ఆసరా మూడో విడత ఆర్థిక సాయం విడుదల చేయనున్నట్లు అధికారులు స్పష్టం చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube