సైబర్ నేరగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలి- ఎస్ ఐ నాగరాజు

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం చెక్కపల్లి ప్రభుత్వ పాఠశాల లో విద్యార్థుల కు వేములవాడ రూరల్ ఎస్ ఐ నాగరాజు పలు అంశాల పై అవగాహన కల్పించారు.సోషల్ మీడియాలో వచ్చే ప్రకటనలు చూసి ఆశపడి మోసపోకండి సైబర్ నేరాలు పెరుగుతున్నాయన్నారు.

 Be Alert To Cyber Criminals Si Nagaraju, Cyber Criminals ,si Nagaraju, Chekkapal-TeluguStop.com

కాబట్టి మొబైల్లో ఆటలు ఆడే సందర్భంలో, వివిధ రకాల సైట్లలో మనకు అవసరమైన వస్తువులు అతితక్కువ ధరకు లభిస్తాయని వచ్చే ప్రకటనలకు ఆకర్షితులైన వారు వెంటనే ఆ లింకు లపై క్లిక్ చేస్తున్నారు.దీంతో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు.

తక్షణమే ఆ మొబైల్ నంబరుకు అనుసంధానంగా ఉన్న బ్యాంకు ఖాతాల్లో ఉన్న డబ్బు నేర గాళ్ల పరమవుతోంది కాబట్టి జాగ్రత్త గా ఉండాలి, ఏదైనా ఆపద సమయం లో డయల్ 100 కి కాల్ చేస్తే వేములవాడ రూరల్ పోలీస్ మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటుంది అని, విద్యార్థుల కు ఏదైనా ఇబ్బంది కలిగే విషయం వున్నా పోలీస్ వారికి సమాచారం ఇవ్వొచ్చు అని, మూఢ నమ్మకాలు నమ్మొద్దు అని విద్యార్ధి దశ నుండే అన్నీ విషయాల పట్ల అవగాహన కలిగి ఉండాలి అని భవిష్యత్తు లో ఉన్నత లక్ష్యం పెట్టుకొని ఉన్నత స్థానం లో ఉండాలి అని ఎస్ ఐ వారికి సూచించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube