ఢిల్లీ రాజకీయాల్లో కేజ్రివాల్( Kejriwal ) ప్రస్థానం ఒక సంచలనం.చీపురు గుర్తును సింబల్ గా పెట్టుకొని అవినీతిమయ రాజకీయాలను ఊడ్చిపారేస్తాను అంటూ ఆయన రాజకీయ యువనికపై దూసుకొచ్చారు.
యువత విద్యావంతులు అధికంగా ఉన్న రాష్ట్రం అవడం వలన ఆయన ఢిల్లీ ( Delhi )అధికార పీఠాన్ని మూడుసార్లు దక్కించుకోగలిగారు.కేంద్ర పాలిత ప్రాంతం అవ్వడం వల్ల ఆయనకు స్వచ్చ గా పరిపాలన నిర్వహించలేక పోతున్నారు.
అయితే ఇప్పుడు ఆయన దృష్టి దేశ రాజకీయాలపై పడింది .ఇతర రాష్ట్రాల్లో కూడా పోటీ చేస్తూ ప్రభావంతమైన ఓట్లను తెచ్చుకోగలిగారు పంజాబ్లో అధికారం కూడా సాధించగలిగారు.
గోవా మహారాష్ట్ర ( Goa Maharashtra )వంటి చోట్ల కూడా ఆయన పార్టీ చెప్పుకోదగ్గ ఓట్లనే తెచ్చుకుంది.ఇంకాస్త ప్రయత్నిస్తే ఖచ్చితంగా ఎర్రకోటపై జెండా ఎగరేయొచ్చు అన్న సమయంలో ఆయన పార్టీ వివాదాల్లో చిక్కుకుంది.మద్యం కుంభకోణం ఆ పార్టీ పరువును బజారున పడేసింది .ఆమ్ ఆద్మీ పార్టీ కేంద్రంగా మొదలైన ఈ వివాదం దేశంలోని చాలామంది రాజకీయ నాయకులను బోనులో నిలబెట్టింది.ప్రతిపక్ష నాయకులందరినీ ఏకం చేసి తాను పెద్దన్న పాత్ర పోశించాలన్న ఆయన కోరిక తీరే పరిస్థితులు కనిపించడం లేదు.ఇంతకుముందు మమతా, కేసీఆర్ లాంటి వారితో కూటమి కట్టి కేంద్రంలో భాజాపా సర్కారును గద్ది దింపాలన్న ఆయన ఆశయానికి ఇప్పుడు మిత్రులే ముఖం చాటేశారు అని అంటున్నారు .
ప్రతిపక్ష నాయకులను ఏకం చేసే చర్యలో భాగంగా ఆయన ప్రగతిశీల ముఖ్యమంత్రుల సంఘం అంటూ ఒక మీటింగ్ పెట్టి కాంగ్రెస్ ఇతర బిజెపి యేతర ముఖ్యమంత్రుల కలయిక కోసం ఒక విందు భేటీని నిర్వహించారు దీనికోసం తనతో సహా ఎనిమిది మంది ముఖ్యమంత్రులను ఆహ్వానించారు.అయితే ఇప్పటికే ఆమ్ ఆద్మీ పార్టీ మద్యం కుంభకోణం లో నిండా మునిగి ఉన్నందున దానితో కలిసి వెళ్తే లేనిపోని సమస్యలు వస్తాయి అనుకున్నారో ఏమిటో కేసీఆర్ మమతతో సహా అందరూ ఈ కార్యక్రమానికి డుమ్మా కొట్టారు.ఇంతకుముందు కేసీఆర్, మమత ఏర్పాటు చేసిన సభలలో పాల్గొన్న కేజ్రీవాల్ తన ఏర్పాటు చేసిన సభకు కూడా వీళ్ళందరూ వస్తారని నమ్మకం పెట్టుకున్నారు అయితే మారిన పరిస్థితితు ల నేపథ్యంలో ఇప్పుడు ఎందుకొచ్చిన గొడవ అనుకుంటూ మిత్రులు ముఖం చాటేస్తున్నారట.మరి సమస్య వచ్చినప్పుడు నిలబడితేనే కదా ఐక్యత కు అర్థం మరి ఇలాంటి మిత్రులతో కలిసి బిజెపిని ఓడించాలని చూస్తున్నా కేజ్రీవాల్ కు కేంద్రం లో అధికారం దక్కుతుందో లేదో చూడాలి
.