వైరల్: భూమిమీద నూకలు మిగలడం అంటే ఇదే... షార్క్ నోటినుండి తప్పించుకున్న యువతి!

ఈ స్మార్ట్ యుగంలో స్మార్ట్ ఫోన్( Smartphone ) లేనివారు దాదాపుగా ఉండరనే చెప్పుకోవాలి.ఇంకేముంది సోషల్ మీడియా హవా కొనసాగుతూనే ఉంటుంది.

 Woman Escaped From Tiger Shark Mouth Horrifying Video Viral,tiger Shark,horrifyi-TeluguStop.com

ఈ క్రమంలో మనం నిత్యం ఇక్కడ రకరకాల వీడియోలను చూస్తూ ఉంటాము.అయితే అందులో కొన్ని చాలా ఫన్నీగాను, మరికొన్ని చాలా చిత్రం విచిత్రంగాను ఉంటాయి.

ఇంకా కొన్నిటిని చూసినపుడు కాస్త ఆశ్చర్యంగా, ఇంకాస్త భయానకంగా కనబడతాయి.తాజాగా ఈ కోవకు చెందిన వీడియో ఒకటి సోషల్ మీడియా( Social Media )లో చక్కెర్లు కొడుతోంది.

సముద్రంలో షార్క్( Shark ) ని చూసినపుడు మనకి చాలా భయం వేయక మానదు.ఎందుకంటే అది అంత పెద్దజీవి కనుక.అలాంటిది దాని దగ్గరకు.అది కూడా దాని నోటిదాక వెళ్తే ఎంత భయకరంగా ఉంటుందో ఎపుడైనా ఆలోచించారా? లేదు ఒకసారి ఊహించుకోండి.చాలా భయం కలుగుతుంది కదా! ఓ మహిళకు కూడా ఇదే అనుభవం ఎదురైంది.నీటిలో డైవింగ్ చేస్తుండగా.

షార్క్ నోటిలోకి వెళ్లబోయి తృటిలో తప్పించుకుంది.అవును, దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారగా… నెటిజన్లు( Netizzens ) దానిపైన భారీస్థాయిలో స్పందిస్తున్నారు.

‘ఆడ్లీ టెర్రిఫైయింగ్’ సోషల్ మీడియా హ్యాండిల్ ద్వారా ఈ వీడియో పోస్టు చేయగా.జనాలను తెగ ఆకర్శించింది.వీడియోని ఒకసారి పరిశీలిస్తే షార్క్ తన నోరు తెరిచి ఆమెను మింగడానికి సిద్ధంగా ఉండడం మనం గమనించవచ్చు.అయితే దాని ఉనికిని గమనించిన మహిళ తప్పించుకొని పడవ ఎక్కడం కొసమెరుపు.

ఆ టైగర్ షార్క్ మహిళ ఫ్లిప్పర్‌లను దాదాపుగా తాకుతుంది.ఈ వీడియోకి ఇప్పటి వరకు 1.6 మిలియన్ కంటే ఎక్కువ వ్యూస్ రావడం విశేషం.ఫుటేజ్ పాతది అయినప్పటికీ ఇప్పుడు ఇది వైరల్ గా మారడం గమనార్హం.

ఈ సంఘటన హవాయిలో జరిగింది.దీనిపైన నెటిజన్స్ స్పందిస్తూ… ‘మీకు ఇంకా ఈ భూమిమీద నూకలు మిగిలాయి!’ అన్న మాదిరి కామెంట్స్ చేయడం ఇక్కడ మనం గమనించవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube