Rana Daggubati : కిడ్నీ మార్పిడి నిజమే.. కన్ను కనిపించదన్న రానా.. ఆ ఆలోచన నుంచి రావాలంటూ..

టాలీవుడ్ హీరోలలో ఒకరైన రానా నటించిన సినిమాలలో మెజారిటీ సినిమాలు సక్సెస్ సాధించినా సోలో హీరోగా రానా( Rana Daggubati ) తెలుగు ప్రేక్షకుల్లో ఆశించిన స్థాయిలో గుర్తింపును సొంతం చేసుకోలేకపోయారు.రానా ఆరోగ్య పరిస్థితి గురించి వేర్వేరు వార్తలు ప్రచారంలో ఉన్నాయి.

 Hero Rana Comments Goes Viral About Health Issues Details Here-TeluguStop.com

రానా నాయుడు వెబ్ సిరీస్ తో మరో సక్సెస్ ను ఖాతాలో వేసుకున్న రానా తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ వెల్లడించిన విషయాలు తెగ వైరల్ అవుతున్నాయి.

నేను నా కుడి కన్నుతో చూడలేనని ఆయన అన్నారు.కార్నియల్ ట్రాన్స్ ప్లాంట్ ( Corneal Transplant )గురించి మాట్లాడిన అతికొద్ది మందిలో నేను ఒకడినని రానా చెప్పుకొచ్చారు.నాకు కిడ్నీ మార్పిడి కూడా జరిగిందని రానా చెప్పుకొచ్చారు.

ఆపరేషన్ ద్వారా ఈ రెండు చికిత్సలు పూర్తయ్యాయని ఆయన కామెంట్లు చేశారు.ఈ విషయంలో నేను టెర్మినేటర్ అని అనుకుంటానని రానా వెల్లడించారు.

శారీరక సమస్యలు వస్తే చాలామంది బాధ పడతారని రానా తెలిపారు.

కొన్నిరోజుల తర్వత ఆ సమస్యలు పరిష్కారం అయినా బాధ పడుతూ ఉంటారని రానా కామెంట్ చేశారు.

అలా కాకుండా ఆ ఆలోచనల నుంచి బయటకు వచ్చి ముందుకెళ్లాలని రానా వెల్లడించారు.రానా చేసిన కామెంట్లు సోషల్ మీడియా( Social Media )లో వైరల్ అవుతున్నాయి.

గతంలో రానా ఆరోగ్య సమస్యలతో ఇబ్బందులు పడినా పైకి మాత్రం నవ్వుతూ కనిపించారనే సంగతి తెలిసిందే.

సోలో హీరోగా రానా అద్భుతమైన విజయాలను సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.సరైన కథలను ఎంచుకుంటే రానా సక్సెస్ సాధించడం కష్టం కాదని కామెంట్లు వినిపిస్తున్నాయి.రానాను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య ఊహించని రేంజ్ లో పెరుగుతోంది.

రానా నాయుడు వెబ్ సిరీస్( Rana Naidu ) కోసం రానా 8 కోట్ల రేంజ్ లో పారితోషికం తీసుకున్నారు. బాలీవుడ్( Bollywood ) లో కూడా రానాకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఊహించని రేంజ్ లో పెరుగుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube