ఆస్కార్ కన్నా ఎంతో విలువైనది... కన్నీళ్లు పెట్టుకున్న కీరవాణి!

ఒక తెలుగు సినిమా ఆస్కార్ అవార్డును అందుకోవడంతో ఆర్ఆర్ఆర్ సినిమా పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమోగిపోతుంది.ఈ సినిమాలోని నాటు నాటు (Naatu Naatu ) పాటకు గాను ఆస్కార్ అవార్డు రావడంతో చిత్ర బృందంపై పెద్ద ఎత్తున సెలెబ్రిటీలు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

 More Valuable Than Oscar Keeravani With Tears, Rajamouli, Rrr, Oscar, Keeravani-TeluguStop.com

ఇక ఈ అవార్డుకు కారణమైనటువంటి వారిలో కీరవాణి(Keeravani) చంద్రబోస్ కూడా కీలకం కావడంతో వీరిపై పెద్ద ఎత్తున ప్రశంసల కురిపిస్తున్నారు.అయితే తాజాగా ఎంఎం కీరవాణి ఆస్కార్ (Oscar) కన్నా గొప్ప గౌరవాన్ని అందుకున్నారు.

అయితే తనకు లభించిన ఈ కానుకను చూసి కన్నీళ్లు పెట్టుకున్నారు.

కీరవాణి సంగీత సారధ్యంలో వచ్చినటువంటి నాటు నాటు పాట ఆస్కార్ అవార్డును అందుకోవడంతో కీరవాణి ఎంతో ఆరాధించే అమెరికన్ రిచర్డ్ కార్పెంటర్ RRR టీంను, ప్రత్యేకంగా కీరవాణి చంద్రబోస్ లను అభినందిస్తూ ఒక వీడియో విడుదల చేశారు.ఈ వీడియో చూసినటువంటి కీరవాణి ఒక్కసారిగా ఎమోషనల్.అవుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు.

ఈ వీడియోలో రిచర్డ్ తో పాటు తన కుటుంబ సభ్యులు అంతా కలిసి పాట రూపంలో కీరవాణి, చంద్రబోస్ లతోపాటు చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ వీడియో పై దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి (Rajamouli) స్పందిస్తూ సర్ ఆస్కార్ క్యాంపెయిన్ లో మా అన్నయ్య చాలా కామ్ గా ఉన్నారు.ఆస్కార్ ముందు, ఆస్కార్ తర్వాత ఎప్పుడూ కూడా తన ఎమోషన్ బయట పెట్టలేదు.ఎప్పుడైతే ఈ వీడియో చూశారో ఆ క్షణం తన భావోద్వేగాలను ఆపుకోలేక కళ్ళ నుంచి నీళ్లు వచ్చేసాయి.

మీ ఈ గిఫ్ట్ మా కుటుంబమంతా గుర్తుంచుకుంటుంది థాంక్యూ సో మచ్ అంటూ రాజమౌళి స్పందించారు.ఇక కీరవాణి కూడా ఈ వీడియోని ట్విట్టర్ వేదికగా షేర్ చేస్తూ ఇది ఊహించని గిఫ్ట్… సంతోషంలో కన్నీళ్లు వచ్చాయి.

ప్రపంచంలో నాకు దక్కిన అత్యంత విలువైన గిఫ్ట్ ఇది అంటూ కీరవాణి కూడా ఎమోషనల్ అయ్యారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube