ఆస్కార్ కన్నా ఎంతో విలువైనది… కన్నీళ్లు పెట్టుకున్న కీరవాణి!
TeluguStop.com
ఒక తెలుగు సినిమా ఆస్కార్ అవార్డును అందుకోవడంతో ఆర్ఆర్ఆర్ సినిమా పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమోగిపోతుంది.
ఈ సినిమాలోని నాటు నాటు (Naatu Naatu ) పాటకు గాను ఆస్కార్ అవార్డు రావడంతో చిత్ర బృందంపై పెద్ద ఎత్తున సెలెబ్రిటీలు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
ఇక ఈ అవార్డుకు కారణమైనటువంటి వారిలో కీరవాణి(Keeravani) చంద్రబోస్ కూడా కీలకం కావడంతో వీరిపై పెద్ద ఎత్తున ప్రశంసల కురిపిస్తున్నారు.
అయితే తాజాగా ఎంఎం కీరవాణి ఆస్కార్ (Oscar) కన్నా గొప్ప గౌరవాన్ని అందుకున్నారు.
అయితే తనకు లభించిన ఈ కానుకను చూసి కన్నీళ్లు పెట్టుకున్నారు. """/" /
కీరవాణి సంగీత సారధ్యంలో వచ్చినటువంటి నాటు నాటు పాట ఆస్కార్ అవార్డును అందుకోవడంతో కీరవాణి ఎంతో ఆరాధించే అమెరికన్ రిచర్డ్ కార్పెంటర్ RRR టీంను, ప్రత్యేకంగా కీరవాణి చంద్రబోస్ లను అభినందిస్తూ ఒక వీడియో విడుదల చేశారు.
ఈ వీడియో చూసినటువంటి కీరవాణి ఒక్కసారిగా ఎమోషనల్.అవుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు.
ఈ వీడియోలో రిచర్డ్ తో పాటు తన కుటుంబ సభ్యులు అంతా కలిసి పాట రూపంలో కీరవాణి, చంద్రబోస్ లతోపాటు చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు.
"""/" /
ఈ వీడియో పై దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి (Rajamouli) స్పందిస్తూ సర్ ఆస్కార్ క్యాంపెయిన్ లో మా అన్నయ్య చాలా కామ్ గా ఉన్నారు.
ఆస్కార్ ముందు, ఆస్కార్ తర్వాత ఎప్పుడూ కూడా తన ఎమోషన్ బయట పెట్టలేదు.
ఎప్పుడైతే ఈ వీడియో చూశారో ఆ క్షణం తన భావోద్వేగాలను ఆపుకోలేక కళ్ళ నుంచి నీళ్లు వచ్చేసాయి.
మీ ఈ గిఫ్ట్ మా కుటుంబమంతా గుర్తుంచుకుంటుంది థాంక్యూ సో మచ్ అంటూ రాజమౌళి స్పందించారు.
ఇక కీరవాణి కూడా ఈ వీడియోని ట్విట్టర్ వేదికగా షేర్ చేస్తూ ఇది ఊహించని గిఫ్ట్.
సంతోషంలో కన్నీళ్లు వచ్చాయి.ప్రపంచంలో నాకు దక్కిన అత్యంత విలువైన గిఫ్ట్ ఇది అంటూ కీరవాణి కూడా ఎమోషనల్ అయ్యారు.
Aussie Play Review And Player Reputation (AU) — Aussie Play Explained For Australian Punters