చరణ్ ఉపాసన ఎక్కడికి వెళ్లినా భక్తితో అలా చేస్తారా.. రియల్లీ గ్రేట్ అంటూ?

టాలీవుడ్ ఇండస్ట్రీలోని క్యూట్ కపుల్స్ లో చరణ్ ఉపాసన జోడీ ఒకటి కాగా వీళ్లిద్దరి మధ్య మంచి అనుబంధం ఉంది.చరణ్ ఉపాసన( Ram Charan Upasana ) కెరీర్ పరంగా ఎంతో ఎదుగుతుండగా వాళ్లిద్దరి భక్తి భావానికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

 Hero Ram Charan Upasana Great In That Matter Details, Ram Charan, Upasana, Ram C-TeluguStop.com

రామ్ చరణ్ మాట్లాడుతూ నేను, నా భార్య ఎక్కడికి వెళ్లినా చిన్న గుడిని ఏర్పాటు చేసుకుని పూజలు ( Pooja ) చేయడం జరుగుతుందని రామ్ చరణ్ అన్నారు.ఈ విధంగా చేయడం మన ఆచారం అని చరణ్ పేర్కొన్నారు.

ఈ విధంగా చేయడం వల్ల మన దేశ సాంప్రదాయాన్ని ఉట్టిపడేలా చేయవచ్చని చరణ్ చెప్పుకొచ్చారు.ప్రతిరోజును కృతజ్ఞతలు చెబుతూ మొదలుపెడతామని మనకు సహాయం చేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలియజేస్తామని రామ్ చరణ్ కామెంట్లు చేశారు.

తన భక్తి గురించి రామ్ చరణ్ చెప్పిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.చరణ్ ఉపాసన భక్తి విషయంలో గ్రేట్ అని నెటిజన్లు చెబుతున్నారు.

చరణ్ బుచ్చిబాబు కాంబినేషన్ లో ఒక సినిమా ఫిక్స్ కాగా ఈ సినిమా షూట్ ఎప్పుడు మొదలవుతుందో ప్రశ్నకు సరైన సమాధానం దొరకడం లేదు.బుచ్చిబాబు( Director Buchhibabu ) ఉప్పెన సినిమాతో సక్సెస్ సాధించిన తర్వాత ఎన్టీఆర్ డేట్ల కోసం ప్రయత్నించారు.అయితే వేర్వేరు కారణాల వల్ల ఎన్టీఆర్ ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం లేదు.చరణ్ మాత్రం బుచ్చిబాబు చెప్పిన కథ నచ్చి వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు.

చరణ్ బుచ్చిబాబు సినిమా పూర్తైన వెంటనే హాలీవుడ్ ప్రాజెక్ట్ లతో బిజీ కానున్నారు.మెగా ఫ్యామిలీ హీరో అయిన చరణ్ భారీ స్థాయిలో ఆస్తులు కూడబెట్టారు.చరణ్ ఆస్తుల విలువ అంతకంతకూ పెరుగుతుండటంతో ఫ్యాన్స్ సంతోషిస్తున్నారు.రామ్ చరణ్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ ఊహించని రేంజ్ లో పెరుగుతుండటం గమనార్హం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube