స్టార్ హీరో బాలకృష్ణ వీరసింహారెడ్డి సినిమాతో బాక్సాఫీస్ వద్ద మరోసారి సత్తా చాటారనే సంగతి తెలిసిందే.ట్రైలర్ తోనే వీరసింహారెడ్డి సినిమాపై అంచనాలు పెరగగా సినిమా కూడా అంచనాలను అందుకుంది.
ఈ సినిమాకు రిలీజ్ రోజున నెగిటివ్ టాక్ వచ్చినా అద్భుతమైన కంటెంట్ తో తెరకెక్కడంతో బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా నిలబడింది.వీరసింహారెడ్డి సినిమాకు ఫుల్ రన్ లో 75 కోట్ల రూపాయల 41 లక్షల రూపాయల కలెక్షన్లు వచ్చాయి.
నైజాంలో ఈ సినిమాకు 17.25 కోట్ల రూపాయల కలెక్షన్లు రాగా సీడెడ్ లో ఈ సినిమాకు ఏకంగా 16.48 కోట్ల రూపాయల కలెక్షన్లు రావడం గమనార్హం.తెలుగు రాష్ట్రాలలో ఈ సినిమాకు ఏకంగా 65 కోట్ల రూపాయల కలెక్షన్లు రాగా ఇతర ప్రాంతాల్లో ఈ సినిమాకు 10 కోట్ల రూపాయల కలెక్షన్లు రావడం గమనార్హం.ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ 68 కోట్ల రూపాయలు కాగా థియేట్రికల్ హక్కుల ద్వారా బయ్యర్లు, డిస్ట్రిబ్యూటర్లకు 7.5 కోట్ల రూపాయల లాభం వచ్చింది.
ఈ సినిమాల నాన్ థియేట్రికల్ హక్కులు సైతం భారీ మొత్తానికి అమ్ముడయ్యాయి.ప్రస్తుతం డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతుండగా స్టార్ మా ఛానల్ ఈ సినిమా శాటిలైట్ హక్కులను కొనుగోలు చేసింది.బాలయ్య రేంజ్ ఇదేనంటూ బాలయ్య ఫ్యాన్స్ తెగ సంతోషిస్తున్నారు.చాలా సంవత్సరాల తర్వాత బాలయ్య బ్యాక్ టు బ్యాక్ విజయాలను అందుకున్నారు.
అనిల్ రావిపూడి సినిమాతో బాలయ్యకు హ్యాట్రిక్ సొంతం కానుందని కామెంట్లు వినిపిస్తున్నాయి.బాలయ్య రెమ్యునరేషన్ 20 కోట్ల రూపాయలు కాగా ప్రస్తుతం నటిస్తున్న ప్రాజెక్ట్ లు సక్సెస్ సాధిస్తే బాలయ్య పారితోషికం 25 కోట్ల రూపాయల రేంజ్ కు పెరిగే అవకాశాలు అయితే ఉంటాయి.బాలయ్య కొత్త ప్రాజెక్ట్ లను అతి త్వరలో ప్రకటించనున్నారు.