స్త్రీ, పురుషుడు అనే తేడా లేకుండా దాదాపు అందరూ స్పాట్ లెస్ స్కిన్ కోసం ఆరాటపడుతుంటారు.కానీ ఏదో ఒక కారణం చేత చర్మం పై మచ్చలు ఏర్పడుతూనే ఉంటాయి.
ఈ మచ్చలు చర్మ సౌందర్యాన్ని తీవ్రంగా దెబ్బతీస్తాయి.అందుకే ముఖ చర్మంపై ఏర్పడ్డ మచ్చలను వదిలించుకోవడం కోసం రకరకాల క్రీములు, సీరంలు వాడుతుంటారు.
కానీ ఇంట్లోనే చాలా సులభంగా మరియు వేగంగా మచ్చలను పోగొట్టుకోవచ్చు.అందుకు ఇప్పుడు చెప్పబోయే పవర్ ఫుల్ రెమెడీ అద్భుతంగా సహాయపడుతుంది.
ఈ రెమెడీని పాటిస్తే కనుక పది రోజుల్లోనే స్పాట్ లెస్ స్కిన్ ను తమ సొంతం చేసుకోవచ్చు.మరి ఇంకెందుకు ఆలస్యం ఆ పవర్ ఫుల్ రెమెడీ ఏంటో తెలుసుకుందాం పదండి.
ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని ఒకటిన్నర గ్లాస్ వాటర్ పోయాలి.అలాగే అందులో ఒక బంగాళదుంప మరియు ఒక టమాటాను వేసి కనీసం పది నిమిషాల పాటు ఉడికించాలి.
ఆ తర్వాత ఉడికించిన బంగాళదుంప టమాటాలకు ఉన్న తొక్కను తొలగించి మిక్సీ జార్లో మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమం నుంచి స్టైనర్ సహాయంతో స్మూత్ క్రీమ్ ను సపరేట్ చేసుకోవాలి.ఈ క్రీమ్ లో వన్ టేబుల్ స్పూన్ కాఫీ పౌడర్, వన్ టేబుల్ స్పూన్ అలోవెరా జెల్, చిటికెడు కుంకుమ పువ్వు, పావు టేబుల్ స్పూన్ కర్పూరం పొడి, వన్ టేబుల్ స్పూన్ స్వీట్ ఆల్మండ్ ఆయిల్ వేసుకుని అన్నీ కలిసేంతవరకు బాగా మిక్స్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముఖానికి ఏదైనా బ్రష్ సహాయంతో అప్లై చేసుకుని ఇరవై నుంచి ముప్పై నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.
అనంతరం వాటర్ తో శుభ్రంగా చర్మాన్ని క్లీన్ చేసుకోవాలి.రోజుకి ఒక్కసారి ఈ పవర్ ఫుల్ రెమెడీని కనుక పాటిస్తే పది రోజుల్లోనే ఎలాంటి మచ్చలు అయినా తగ్గుముఖం పట్టడం ప్రారంభమవుతాయి.అలాగే బ్రైట్ అండ్ స్పాట్ లెస్ స్కిన్ మీ సొంతమవుతుంది.ఈ రెమెడీని పాటించడం వల్ల చర్మం మృదువుగా మరియు కోమలంగా మారుతుంది.మొటిమలు ఏమైనా ఉన్నా సరే చాలా వేగంగా మాయమవుతాయి.కాబట్టి తప్పకుండా ఈ రెమెడీని పాటించేందుకు ప్రయత్నించండి.