సనాతన ధర్మంలో మంగళవారం ఆంజనేయ స్వామికి అంకితం చేయబడి ఉంది.మంగళవారం రోజు కొన్ని ప్రత్యేక చర్యలు తీసుకుంటే జీవితంలో కష్ట, నష్టాలు దూరమై సుఖసంతోషాలు దక్కుతాయని చాలామంది ప్రజలు భావిస్తారు.
ఈ నేపథ్యంలో మంగళవారానికి రోజున హనుమంతుడిని ప్రసన్నం చేసుకోవడానికి చేయవలసిన ఈ పనుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
మీ జాతకంలో శని మహాదశ కొనసాగుతున్న లేదా శని దోషం ఉండడం వల్ల జరుగుతున్న పనిలో ఎన్నో రకాల ఆటంకాలు ఎదురవుతుంటే మంగళవారం రోజు 108 తులసి ఆకులపై పసుపు చందనంతో రాముని నామాన్ని రాయండి.
ఆకుతో ఒక దండం తయారుచేసి ఆంజనేయ స్వామికి అలంకరించండి.ఇలా చేయడం ద్వారా రాహువు, కుజుడు, శని గ్రహాలకు సంబంధించిన అన్ని దోషాలు దూరమైపోతాయి.
ఆర్థిక సంక్షోభం కూడా దూరం అయిపోతుందని చాలామంది ప్రజలు నమ్ముతారు.
ఇంకా చెప్పాలంటే మంగళవారం తెల్లవారుజామున నిద్రలేచి అభ్యంగ స్నానం చేసి తరువాత ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్లి పూలమాలలు, దీపాలు, లడ్డులను సమర్పించడం మంచిది.ఆ తర్వాత 108 సార్లు హనుమాన్ చాలీసా పాటించాలి.మీ కష్టాలన్నీ తొలగిపోవడానికి హనుమంతుని ప్రార్థించండి.
ఈ పరిహారాన్ని ప్రతి మంగళవారం, శనివారం చేయడం ద్వారా జన్మ నక్షత్రానికి సంబంధించిన దోషాలు తొలగిపోయి శుభాలు జరుగుతాయి.
అకాల మరణం భయంతో చాలామంది ఇబ్బంది పడేవారు ఉంటారు.ఇలాంటి వారు మంగళవారం ఉదయం ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్లి హనుమంతునికి సింధూరం సమర్పించండి.దీనితోపాటు గులాబీ పూల దండలు సమర్పించడం ఎంతో మంచిది.
ఇంకా ఆవు నెయ్యి దీపం వెలిగించాలి.ఈ పరిహారాన్ని 11 మంగళవారంలో చేయడం ద్వారా అన్ని భయాలు, కష్టాలు తొలగిపోతాయి.
అకాల మరణా ప్రమాదం కూడా దూరం అవుతుంది.మంగళవారం రోజు కోతులు ఉన్న ప్రదేశానికి వెళ్లి అరటి పండ్లు, బెల్లం, శనగలు వాటికి తినిపించాలి.
ఇంకా చెప్పాలంటే నిరుపేదలకు ఆహారం అందించడం మంచిది.ఈ చర్యలు మంగళవారం రోజున చేయడం ద్వారా ఆర్థిక సంక్షోభం దూరమైపోతుంది అని చాలామంది నమ్ముతారు.
LATEST NEWS - TELUGU