బాలీవుడ్ నుండి వచ్చి టాలీవుడ్‌లో హీరోయిన్‌గా దూసుకుపోతున్న పూజా హెగ్డే, ప్రస్తుతం టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా మారింది.ఇప్పటికే వరుసబెట్టి సినిమాలు చేస్తున్న పూజా, వరుసగా సక్సెస్‌ను కూడా అందుకుంటోంది.
కాగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన రీసెంట్ మూవీ అల వైకుంఠపురములో చిత్రంలో హీరోయిన్‌గా పూజా హెగ్డే నటించగా, అది ఎలాంటి విజయాన్ని అందుకుందో మనందరికీ తెలిసిందే.
ఇక ప్రస్తుతం ప్రభాస్ సరసన ‘రాధేశ్యామ్’, అక్కినేని అఖిల్ సరసన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ చిత్రాల్లో హీరోయిన్‌గా నటిస్తున్న పూజా, తన నెక్ట్స్ చిత్రాలను కూడా లైన్‌లో పెట్టేందుకు రెడీ అవుతోంది.
ఇప్పటికే పలువురు స్టార్ హీరోలు తమ సినిమాలో పూజాను హీరోయిన్‌గా తీసుకోవాలంటూ దర్శకనిర్మాతలను కోరుతున్నారు.అయితే ఈ క్రమంలోనే ఓ అదిరిపోయే ఆఫర్ పూజా హెగ్డేను వరించిందనే టాక్ ఇప్పుడు ఇండస్ట్రీలో వినిపిస్తోంది.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుసబెట్టి సినిమాల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే గబ్బర్‌సింగ్ డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో ఓ సినిమాలో నటించేందుకు పవన్ ఓకే చెప్పాడు.
అయితే ఈ సినిమాలో హీరోయిన్‌గా అందాల భామ పూజా హెగ్డేను తీసుకోవాలని చిత్ర యూనిట్ భావిస్తోంది.అమ్మడు నటిస్తున్న చిత్రాలు వరుసగా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌లుగా నిలుస్తుండటంతో ఆమెను తీసుకోవాలని హరీష్ శంకర్ భావిస్తున్నాడు.
ఒకవేళ ఇదే నిజమైతే, అమ్మడుకి మరింత అదృష్టం పట్టనుందని చెప్పాలి.