రామాయణంలో కుంభకర్ణుని పాత్ర ఎంతో ప్రత్యేకంగా కనిపిస్తుంది.రావణుని సోదరుడైని కుంభకర్ణుడు నాటి కాలంలో ఉన్నత విద్యావంతుడని కూడా చెబుతారు.
అయితే కుంభకర్ణుడి వ్యక్తిత్వం చాలా ఆసక్తికరంగా ఉంటుంది.అతనికి సంబంధించిన ప్రతీ అంశం ఆశ్చర్యం కలిగిస్తుంది.
కుంభకర్ణుడు బ్రహ్మదేవునికి 6 నెలల నిద్ర వరాన్ని అడిగాడనే విషయం అందరికీ తెలిసిందే.ఈ వరాన్ని బ్రహ్మ సంతోషంగా అంగీకరించాడు.
ఆ రోజు నుండి కుంభకర్ణుడు 6 నెలలు నిద్రలోకి జారుకున్నాడు.ఇలా కుంభకర్ణునికి సంబంధించిన కొన్ని విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
కుంభకర్ణుడు ఆరు నెలల పాటు హాయిగా నిద్రపోయేవాడు.అత్యున్నత విద్యావంతుడైన కుంభకర్ణుడు తన జీవితాన్ని ఎందుకు నిద్రలోనే గడిపాడనే సందేహం అందిరిలోనూ మెదులుతుంది.
ఈ నేపధ్యంలో చాలా మంది పరిశోధకులు కుంభకర్ణుడి ఈ సుదీర్ఘ నిద్ర రహస్యాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించారు.రామాయణంలో పేర్కన్నొ వివరాల ప్రకారం కుంభకర్ణుడు ఒక శాస్త్రవేత్త, అతను అనూహ్యమైన పరిశోధన కోసం రహస్య ప్రదేశానికి వెళ్లవలసి వచ్చింది.
ఈ రహస్య ప్రదేశం కిష్కింధకు దక్షిణంగా ఉన్న ఒక గుహలో ఉందని, అక్కడ అతను భారీ ప్రయోగశాలను నెలకొల్పాడని చెబుతారు.
అతను తన సహోద్యోగులతో కలసి ఈ ప్రదేశంలో అధిక అధునాతన ప్రయోగాలు చేసేవాడట.
ఇంతేకాకుండా కుంభకర్ణుడి శాస్త్రీయ ప్రయోగశాల ప్రస్తుత లాటిన్ అమెరికన్ దేశంలో ఉందని, అక్కడ అతను స్వయంగా తయారు చేసిన అత్యాధునిక విమానాలను ఉపయోగించాడని కొందరు పరిశోధకులు పేర్కొన్నారు.కుంభకర్ణుడి సహాయంతో రావణుడు ఆటోమేటిక్ ఆయుధాలు, దివ్యాస్త్రాలతో సహా అనేక విమానాలను రూపొందింపజేశాడని కూడా కొందరు పరిశోధకులు చెబుతున్నారు.
రామాయణంలో పేర్కొన్న పుష్పక విమానం కుంభకర్ణుడు తయారు చేశారంటారు.ఈ విమానాల సాటిలేని సామర్థ్యం నేటి శాస్త్రవేత్తలను సైతం ఆశ్చర్యపరుస్తోంది.
ఇది కేవలం కల్పిత కథగా పరిగణించకపోతే, కుంభకర్ణుని శాస్త్రీయ సామర్థ్యం అద్భుతమని, ఆ సమయంలో ప్రపంచానికి చెందిన గొప్ప పరిశోధకుడని అంగీకరించడంలో ఇబ్బంది లేదు.