వాట్సాప్ అకౌంట్ బ్యాన్ అయిందా.. ఇకపై ఇలా చేయవచ్చు!

ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ ఎప్పుడూ మిలియన్ల కొద్దీ యూజర్లను బ్యాన్ చేస్తూనే ఉంటుంది.ఇందుకు కారణం ఆ యూజర్లు స్పామ్ లేదా స్కామ్‌కి పాల్గొనడం.

 Has The Whatsapp Account Been Banned Now You Can Do This Whatsapp, Messages, Cha-TeluguStop.com

అలాగే వాట్సాప్ నియమ, నిబంధనలకు విరుద్ధంగా నడుచుకోవడం అని చెప్పవచ్చు.అయితే ఒక్కోసారి వాట్సాప్ అకారణంగానే కొందరి యూజర్లను బ్యాన్ చేస్తుంది.

బ్యాన్ లిఫ్ట్ చేసుకునేందుకు యూజర్లు వాట్సాప్ సపోర్టు ద్వారా విజ్ఞప్తి చేయాల్సి ఉంటుంది.అప్పుడు వాట్సాప్ సపోర్ట్ టీమ్‌ అన్ని సమీక్షించి బ్యాన్ అనవసరంగా విధించినట్లయితే దానిని వెంటనే తొలగిస్తుంది.

అయితే ఇదంతా లాంగ్ ప్రాసెస్ కావడం వల్ల యూజర్లు ఇబ్బందులు పడుతున్నారు.ఈ నేపథ్యంలోనే బ్యాన్‌ను ఈజీగా లిఫ్ట్ చేసుకునేందుకు వీలుగా ఒక ఫీచర్ తీసుకొచ్చేందుకు వాట్సాప్ సిద్ధమైంది.

బ్యాన్ అప్పీల్ అనే పేరిట ఈ ఫీచర్‌ను తీసుకు వచ్చే పనిలో వాట్సాప్ నిమగ్నమైందని తాజాగా వాట్సాప్ బీటా ఇన్ఫో రిపోర్ట్ పేర్కొంది.ప్రస్తుతానికి ఈ మెసేజ్ యాప్ ఈ ఫీచర్‌ని టెస్ట్ చేస్తున్నట్లు తెలిపింది.

వాట్సాప్ లేటెస్ట్ బీటా వెర్షన్ యాప్‌లో బ్లాక్ అప్పీల్ ఆప్షన్ కనిపించింది.రెగ్యులర్ యూజర్లందరికీ ఈ ఆప్షన్ త్వరలోనే అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

దీని వల్ల బ్యాన్‌కి గురైనవారు యాప్ లోనే బ్యాన్‌ లిఫ్ట్ చేయాలని వాట్సాప్ కు చాలా సులభంగా విజ్ఞప్తి చేయవచ్చు.

Telugu Chats, Messages, Ups, Whatsapp-Latest News - Telugu

ఇదిలా ఉండగా వాట్సాప్ వీడియో కాల్స్ కోసం డిజిటల్ అవతార్స్ కూడా తీసుకు వచ్చేందుకు సిద్ధమైంది.ఈ డిజిటల్ అవతార్ అందుబాటులోకి వస్తే యూజర్లు తమ వీడియో కాల్స్‌లో తమ ముఖము లేదా డీపీకి బదులుగా అవతార్స్ వాడుకోవచ్చు.ఈ ఫీచర్ భవిష్యత్తులో లాంచ్ అయ్యే అవకాశం ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube