యూకే : భారత సంతతి వ్యాపారవేత్తకు ప్రతిష్టాత్మక ‘ ఫ్రీడమ్ ఆఫ్ సిటీ ఆఫ్ లండన్ ’

భారత సంతతికి చెందిన ఔత్సాహిక పారిశ్రామికవేత్తకు లండన్‌లో ప్రతిష్టాత్మక గౌరవం దక్కింది.హియర్ అండ్ నౌ 365 వ్యవస్థాపకుడు మనీష్ తివారీ ‘‘ఫ్రీడమ్ ఆఫ్ సిటీ ఆఫ్ లండన్’’ అవార్డ్ వరించింది.

 Indian Origin Entrepreneur Manish Tiwari Conferred Freedom Of City Of London Hon-TeluguStop.com

తనకు ఈ గౌరవం దక్కడంపై ఆయన స్పందించారు.లండన్ నగరం పెరుగుతూ , అభివృద్ధి చెందుతూనే వుందన్నారు.

గతాన్ని గుర్తుచేసుకుంటూ, మార్పును స్వీకరించడం ద్వారా ఈ నగరం గ్లోబల్ ఫైనాన్స్ విభాగంలో ముందంజలో వుందని చెప్పారు.ఈ ఘన వారసత్వంలో భాగమైనందుకు తనకు గర్వంగా వుందని మనీష్ తివారీ తెలిపారు.

‘‘ఫ్రీడమ్ ఆఫ్ సిటీ ఆఫ్ లండన్’’ అనేది బ్రిటీష్ రాజధానికి చెందిన పురాతన వేడుకలలో ఒకటి.ఈ బిరుదును ప్రదానం చేసే సంప్రదాయం 1237లో ప్రారంభమైందని చెబుతారు.

ఫ్రీమాన్ అనే బిరుదు ప్రతిష్టాత్మకమైనది.గతంలో ఈ గౌరవాన్ని అందుకున్న తొలి భారతీయుడు, దేశ తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ.

ఇతర ప్రముఖులతో దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు నెల్సన్ మండేలా, మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్ వున్నారు.

Telugu Alok Sharma, Freeman, England, Freedom London, Indianorigin, London, Mani

ఈ నెల ప్రారంభంలో లండన్‌లోని ఐకానిక్ గిల్డ్‌హాల్‌లోని ఛాంబర్‌లైన్ కోర్టులో జరిగిన కార్యక్రమంలో తివారీ ఈ గౌరవాన్ని పొందారు.అనంతరం డిక్లరేషన్ ఆఫ్ ఏ ఫ్రీమాన్ చదివిన తర్వాత ఫ్రీమాన్స్ డిక్లరేషన్ బుక్‌పై సంతకం చేశారు మనీష్ తివారి. అనంతరం అతనికి ఫ్రీమాన్ కాపీని అందజేశారు.

ఇకపోతే.ఈ నెల ప్రారంభంలో భారత సంతతికి చెందిన బ్రిటన్ మాజీ మంత్రి అలోక్ శర్మకు కింగ్స్ న్యూఇయర్ హానర్స్ లిస్ట్‌లో స్థానం లభించిన సంగతి తెలిసిందే.

Telugu Alok Sharma, Freeman, England, Freedom London, Indianorigin, London, Mani

COP26 శిఖరాగ్ర సదస్సు ద్వారా వాతావరణ మార్పులను ఎదుర్కోవడంలో చేసిన కృషికి గాను అలోక్ శర్మకు ఈ గౌరవం దక్కింది.ఆయనతో పాటు భారత సంతతికి చెందిన ప్రచారకులు, ఆర్ధికవేత్తలు, విద్యావేత్తలు, వైద్య నిపుణులు 30 మందికి కూడా ఈ హానర్స్ లిస్ట్‌లో చోటు లభించింది.ఎకనామిక్స్, నేచురల్ ఎన్విరాన్‌మెంట్‌కు చేసిన సేవలకు గాను ప్రొఫెసర్ సర్ పార్థసారథి దాస్‌గుప్తాకు కూడా నైట్ గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ బ్రిటీష్ ఎంపైర్ (జీబీఈ)కి ఎంపికయ్యారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube