యూకే : భారత సంతతి వ్యాపారవేత్తకు ప్రతిష్టాత్మక ‘ ఫ్రీడమ్ ఆఫ్ సిటీ ఆఫ్ లండన్ ’

యూకే : భారత సంతతి వ్యాపారవేత్తకు ప్రతిష్టాత్మక ‘ ఫ్రీడమ్ ఆఫ్ సిటీ ఆఫ్ లండన్ ’

భారత సంతతికి చెందిన ఔత్సాహిక పారిశ్రామికవేత్తకు లండన్‌లో ప్రతిష్టాత్మక గౌరవం దక్కింది.హియర్ అండ్ నౌ 365 వ్యవస్థాపకుడు మనీష్ తివారీ ‘‘ఫ్రీడమ్ ఆఫ్ సిటీ ఆఫ్ లండన్’’ అవార్డ్ వరించింది.

యూకే : భారత సంతతి వ్యాపారవేత్తకు ప్రతిష్టాత్మక ‘ ఫ్రీడమ్ ఆఫ్ సిటీ ఆఫ్ లండన్ ’

తనకు ఈ గౌరవం దక్కడంపై ఆయన స్పందించారు.లండన్ నగరం పెరుగుతూ , అభివృద్ధి చెందుతూనే వుందన్నారు.

యూకే : భారత సంతతి వ్యాపారవేత్తకు ప్రతిష్టాత్మక ‘ ఫ్రీడమ్ ఆఫ్ సిటీ ఆఫ్ లండన్ ’

గతాన్ని గుర్తుచేసుకుంటూ, మార్పును స్వీకరించడం ద్వారా ఈ నగరం గ్లోబల్ ఫైనాన్స్ విభాగంలో ముందంజలో వుందని చెప్పారు.

ఈ ఘన వారసత్వంలో భాగమైనందుకు తనకు గర్వంగా వుందని మనీష్ తివారీ తెలిపారు.

‘‘ఫ్రీడమ్ ఆఫ్ సిటీ ఆఫ్ లండన్’’ అనేది బ్రిటీష్ రాజధానికి చెందిన పురాతన వేడుకలలో ఒకటి.

ఈ బిరుదును ప్రదానం చేసే సంప్రదాయం 1237లో ప్రారంభమైందని చెబుతారు.ఫ్రీమాన్ అనే బిరుదు ప్రతిష్టాత్మకమైనది.

గతంలో ఈ గౌరవాన్ని అందుకున్న తొలి భారతీయుడు, దేశ తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ.

ఇతర ప్రముఖులతో దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు నెల్సన్ మండేలా, మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్ వున్నారు.

"""/"/ ఈ నెల ప్రారంభంలో లండన్‌లోని ఐకానిక్ గిల్డ్‌హాల్‌లోని ఛాంబర్‌లైన్ కోర్టులో జరిగిన కార్యక్రమంలో తివారీ ఈ గౌరవాన్ని పొందారు.

అనంతరం డిక్లరేషన్ ఆఫ్ ఏ ఫ్రీమాన్ చదివిన తర్వాత ఫ్రీమాన్స్ డిక్లరేషన్ బుక్‌పై సంతకం చేశారు మనీష్ తివారి.

అనంతరం అతనికి ఫ్రీమాన్ కాపీని అందజేశారు.ఇకపోతే.

ఈ నెల ప్రారంభంలో భారత సంతతికి చెందిన బ్రిటన్ మాజీ మంత్రి అలోక్ శర్మకు కింగ్స్ న్యూఇయర్ హానర్స్ లిస్ట్‌లో స్థానం లభించిన సంగతి తెలిసిందే.

"""/"/ COP26 శిఖరాగ్ర సదస్సు ద్వారా వాతావరణ మార్పులను ఎదుర్కోవడంలో చేసిన కృషికి గాను అలోక్ శర్మకు ఈ గౌరవం దక్కింది.

ఆయనతో పాటు భారత సంతతికి చెందిన ప్రచారకులు, ఆర్ధికవేత్తలు, విద్యావేత్తలు, వైద్య నిపుణులు 30 మందికి కూడా ఈ హానర్స్ లిస్ట్‌లో చోటు లభించింది.

ఎకనామిక్స్, నేచురల్ ఎన్విరాన్‌మెంట్‌కు చేసిన సేవలకు గాను ప్రొఫెసర్ సర్ పార్థసారథి దాస్‌గుప్తాకు కూడా నైట్ గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ బ్రిటీష్ ఎంపైర్ (జీబీఈ)కి ఎంపికయ్యారు.

ఆ మాటకు మబ్బులు విడిపోయాయి.. హరీష్ శంకర్ షాకింగ్ కామెంట్స్ వైరల్!

ఆ మాటకు మబ్బులు విడిపోయాయి.. హరీష్ శంకర్ షాకింగ్ కామెంట్స్ వైరల్!