పార్వతీపురం మన్యం జిల్లా తాలాడలో ఏనుగులు బీభత్సం సృష్టించాయి.గ్రామానికి చెందిన కొందరిపై గజరాజులు దాడి చేశాయి.
ఏనుగుల దాడిలో గోపిశెట్టి చిన్నారావు, పార్వతి, జయలక్ష్మీలు తీవ్రంగా గాయపడ్డారు.వెంటనే గమనించిన స్థానికులు బాధితులను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు.
కాగా చిన్నారావు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు.మరోవైపు ఏనుగుల దాడి నేపథ్యంలో సమీప గ్రామస్థులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.
పది రోజుల్లోనే రెండు సార్లు గ్రామంపై దాడి చేశాయని వాపోతున్నారు.ఈ క్రమంలో అటవీ శాఖ అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.