న్యూ ఇయర్, లాంగ్ వీకెండ్‌ తో కుమ్మేయనున్న మాస్ రాజా

మాస్ మహా రాజా రవితేజ హీరో గా నటించిన ధమాకా సినిమా క్రిస్మస్ కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.హీరో గా రవితేజ చాలా కాలం తర్వాత భారీ కమర్షియల్‌ సక్సెస్ దక్కించుకోవడంతో ఆయన అభిమానులు ఫుల్ హ్యాపీగా ఉన్నారు.

 Raviteja Dhamaka Movie Collections And Record , Raviteja Dhamaka Movie ,ravitej-TeluguStop.com

ఈ సమయం లోనే ఆయన సినిమా రెట్టింపు ఉత్సాహం తో దూసుకు వెళ్తోంది.కలెక్షన్స్ విషయంలో రవితేజ కెరియర్ లోనే ది బెస్ట్ గా నిలవబోతోంది అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ప్రస్తుతం రవితేజ చేస్తున్న సినిమాలు ధమాకా మాదిరిగా సక్సెస్ కొట్టబోతున్నాయని.ధమాకా సినిమా తో మరోసారి రవితేజ స్టామినా మరియు క్రేజ్‌ నిరూపితం అయింది అంటూ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఇక కొత్త సంవత్సరం మరియు లాంగ్ వీకెండ్ కారణంగా ఈ సినిమా భారీ గా కలెక్షన్స్ నమోదు చేయబోతోంది.ఇప్పటికే ఈ సినిమా 65 కోట్ల రూపాయల కలెక్షన్స్ నమోదు చేసినట్లుగా తెలుస్తోంది.

ఈ కొత్త సంవత్సరం మరియు లాంగ్ వీకెండ్‌ కారణంగా మరో 30 నుండి 40 కోట్ల కలెక్షన్స్ నమోదయ్యే అవకాశం ఉంది.

పెద్దగా పోటీ ఈ సమయంలో లేదు కనుక ధమాకా బాక్సాఫీస్ వద్ద షేక్ చేస్తూ దూసుకు పోతుంది.ఇదే కంటిన్యూ అయితే ఈ సినిమా 100 కోట్ల క్లబ్ లో జాయిన్ అవ్వడం ఖాయం అంటూ బాక్సాఫీస్‌ వర్గాల వారు కామెంట్స్ చేస్తున్నారు.అతి త్వరలోనే సినిమా కు సంబంధించిన 100 కోట్ల వసూళ్ల వార్త ను వినబోతున్నాం అంటూ రవితేజ అభిమానులు చాలా ధీమా తో ఉన్నారు.

అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ధమాకా సినిమా లోని అన్ని పాటలు కూడా హిట్ అయ్యాయి.ముఖ్యంగా పల్సర్‌ బండి పాటకు రవితేజ మరియు శ్రీ లీలా వేసిన డాన్స్ ఆకట్టుకుంది.

థియేటర్ లో ఆ పాట దుమ్ము లేచే విధంగా సందడి చేస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube