డీజే టిల్లు సీక్వెల్ విషయంలో జరిగింది ఇదే... మొత్తం బయటపెట్టిన శ్రీ లీల?

టాలీవుడ్ ఇండస్ట్రీలో ట్రెండింగ్ హీరోయిన్ల జాబితాలో చేరిపోయారు నటి శ్రీ లీలపెళ్లి సందడి సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైనటువంటి ఈ కన్నడ బ్యూటీ మొదటి సినిమాతోనే తన నటనతో, అందచందాలతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.తన మొదటి సినిమా ఫలితం ఎలాగున్నా ఈమె నటన మాత్రం పలువురు దర్శక నిర్మాతల కంట పడటంతో ఈమెకు వరుస సినిమా అవకాశాలు వచ్చాయి.

 This Is What Happened In Th Case Of Dj Tillus Sequel Sri Leela Revealed The Wh-TeluguStop.com

ఇక తాజాగా ఈమె రవితేజ సరసన ధమాకా సినిమాలో నటించి ప్రేక్షకుల ముందుకు వచ్చారు.ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.

ఇలా ధమాకా సినిమా మంచి హిట్ అవడంతో ఈమెకు మరిన్ని అవకాశాలు వస్తున్నాయి.అయితే ఇప్పటికే ఎన్నో సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నటువంటి శ్రీ లీల ఒక క్రేజీ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుందని గత కొద్దిరోజులుగా వార్తలు వచ్చాయి.

సిద్దు జొన్నలగడ్డ హీరోగా నటించిన డీజే టిల్లు సినిమా ఎలాంటి విజయం అందుకుందో మనకు తెలిసిందే.అయితే ఈ సినిమా సీక్వెల్ చిత్రంలో హీరోయిన్ గా శ్రీ లీలను ఎంపిక చేస్తారని కొన్ని కారణాలవల్ల ఈమె ఈ సినిమా నుంచి తప్పుకుందని పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి.

తాజాగా ఈ సినిమా గురించి ఈ సినిమా నుంచి ఆమె తప్పుకోవడానికి గల కారణాలు గురించి శ్రీ లీల బయటపెట్టారు.ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి శ్రీ లీల డి జే టిల్లు సినిమా గురించి మాట్లాడుతూ…ఈ సినిమాలో నటించమని తనని ఎవరు అప్రోచ్ కాలేదని అయితే నేను ఈ సినిమాకు కమిట్ అయ్యి కొద్దిరోజులు షూటింగ్లో పాల్గొన్న తర్వాత తప్పుకున్నానని వచ్చే వార్తలలో ఏ మాత్రం నిజం లేదని అవన్నీ ఒట్టి పుకార్లు మాత్రమే అంటూ ఈమె అసలు విషయం బయట పెట్టారు.ఒకవేళ తాను ఏ సినిమాకి కమిట్ అయిన వెంటనే ఆ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా అందరితో పంచుకుంటానని, డిజె టిల్లు సినిమాకి మాత్రం తాను కమిట్ అవ్వలేదని తెలియజేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube