వైరల్: పాపం కొడుకు వలన తండ్రికి నడ్డి విరిగింది... ఎలాగో తెలిస్తే నవ్వి పోతారు?

సోషల్ మీడియాలో అనునిత్యం అనేకరాల వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి.అందులో కొన్ని ఫన్నీగా ఉంటే, కొన్ని అతిశయోక్తిగా, మరికొన్ని ఆశ్చర్యంగా… ఇంకొన్ని వింతగా, ఎమోషనల్ గా అనిపిస్తాయి.

 Viral: Father's Leg Is Broken Due To Son's Sin... If You Know How, You Will Laug-TeluguStop.com

తాజాగా వివేక్ గుప్తా అనే జర్నలిస్ట్ తన ట్విట్టర్‌లో ఒక షాకింగ్‌ వీడియోను షేర్ చేయగా నెటిజన్లు అది చూసి తెగ నవ్వుకుంటున్నారు.వైరల్‌ వీడియోలో ఒక వ్యక్తి తన బిడ్డతో కలిసి స్కూటర్‌పై వెళ్లడం గమనించవచ్చు.

అంతలోనే ఊహించని ఘటన చోటు చేసుకుంది.అక్కడ జరిగిన సీన్‌ మొత్తం సీసీ కెమెరాలో రికార్డ్‌ కాగా తాజాగా వెలుగు చూసింది.

ఈ ఘటన మహారాష్ట్రలోని సింధుదుర్గలో జరిగినట్లు వీడియోని బట్టి తెలుస్తోంది.వివరాల్లోకి వెళితే.ఈ వీడియోలో ఓ ఇంటి ముందు స్కూటర్‌పై తండ్రి, తన బిడ్డతో కలిసి కూర్చుని ఉండటం చూడవచ్చు.ఏదో పనిపైన బయటకు వెళ్లేందుకు తన బిడ్డను తీసుకుని అతగాడు బయల్దేరాడు.

కాగా ఇంతలోనే ఇంటి లోపలి నుంచి ఒక మహిళ బయటకు వస్తూ ఏదో తెచ్చి అతనికి ఇచ్చేందుకు ప్రయత్నిస్తోంది.అదే సమయంలో ఆ స్కూటీపై ముందు నిల్చొని ఉన్న బాలుడు యాక్సిలరేటర్ పట్టుకొని ముందుకి తిప్పడంతో ఒక్కసారిగా స్కూటీ ముందుకు కదిలింది.

ఇంకేముంది, కట్ చేస్తే… స్కూటీ అదుపుతప్పడంతో బాలుడు కిందపడిపోగా, స్కూటీపై ఉన్న వ్యక్తి వెనక్కి అమాంతం ఎగిరిపడ్డాడు.ఆ చిన్న కుర్రాడి చేసిన పనికి స్కూటర్‌ వెళ్లి ముందున్న స్తంభాన్ని ఢీకొట్టింది.ఈ వీడియోను ప్రముఖ జర్నలిస్ట్ వివేక్ గుప్తా ట్విట్టర్‌ ద్వారా షేర్‌ చేసి చిన్నపిల్లల్ని అలా వాహనాలపై కూర్చోబెట్టేటపుడు జరా జాగ్రత్తగా వుండండి అన్నట్టు క్యాప్షన్ ఇచ్చారు.అదృష్టం కొద్దీ ఎవరికీ ఏమి జరగలేదు.

అదే సీన్ ఏదైనా ట్రాఫిక్ లో జరిగితే ఇక అంతేనని నెటిజన్లు కొందరు జాగ్రత్తలు చెప్పగా మరికొందరు అదొక ఫన్నీ సీన్ అనుకొని నవ్వుకొంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube