హీరోగా తెలుగు చిత్ర పరిశ్రమలో పలు సినిమాలలో నటించి అనంతరం ఎన్నో సినిమాలలో సహాయ నటుడిగా యంగ్ హీరో హీరోయిన్లకు తండ్రి పాత్రలలో నటిస్తూ ఎంతో మంది ప్రేక్షకులను సందడి చేసిన సీనియర్ నటుడు చంద్రమోహన్ గురించి అందరికీ సుపరిచితమే.అయితే ఎన్నో తెలుగు సినిమాలలో ప్రేక్షకులను సందడి చేసిన ఈయన ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమకు దూరంగా ఉంటున్నారు.
ఇలా ఇండస్ట్రీకి దూరమైనటువంటి చంద్రమోహన్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొని తన సినీ కెరియర్ గురించి పలు ఆసక్తికరమైన విషయాలను తెలియచేశారు.ఈ సందర్భంగా ఈయన మాట్లాడుతూ సినీ ఇండస్ట్రీ మద్రాస్ నుంచి హైదరాబాద్ వచ్చిన తర్వాత చాలామంది హీరోలు అందరూ కూడా హైదరాబాద్ వచ్చారు.
ఇక తనకు శోభన్ బాబుతో ఎంతో మంచి అనుబంధం ఏర్పడిందని ఇద్దరం కూడా ఏరా అంటూ మాట్లాడుకునే వాళ్ళమని ఈయన తెలిపారు.ఇలా హీరోలు అందరూ కూడా హైదరాబాద్ వచ్చినప్పటికీ నేను శోభన్ బాబు మాత్రం చెన్నైలో ఉండిపోయామని తెలిపారు.
ఇక మేమిద్దరం మాత్రమే చెన్నైలో ఉన్న సమయంలో మా ఇద్దరి మధ్య మరింత బాండింగ్ పెరిగిపోయిందని చంద్రమోహన్ తెలిపారు.ఇలా వారంలో ఒకరోజు ఇద్దరం కలిసి అన్ని విషయాల గురించి మాట్లాడుకుంటూ సరదాగా గడిపే వాళ్ళం.
ఇక ఇద్దరు మాట్లాడే సమయంలో ఏరా అంటూ శోభన్ బాబును తాను పిలిచేవాడినని చంద్రమోహన్ తెలిపారు.
అయితే ఒక రోజు శోభన్ బాబు ఇంటికి వెళ్లి శోభన్ బాబు అని పిలవడంతో వెంటనే ఆయన ఏం బలిసిందా అంటూ తనని అందరి ముందు అవమానించారని ఈ సందర్భంగా చంద్రమోహన్ తెలిపారు.ఏరా శోభన్ బాబు అని పిలవకుండా శోభన్ బాబు అని పేరుతో పిలుస్తున్నావు అంటూ ఆయన అలా మాట్లాడారని నువ్వు నేను తుది శ్వాస విడిచే వరకు మనిద్దరి మధ్య ఏరా పోరా అని బంధం ఉండాలని చెప్పేవారు అంటూ ఈ సందర్భంగా శోభన్ బాబు గురించి పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు.ప్రస్తుతం చంద్రమోహన్ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.