నీరసం.సర్వ సాధారణంగా వేధించే సమస్యల్లో ఇది ఒకటి.
అయితే ఒక్కోసారి నీరసం పట్టుకుందంటే అంత సులభంగా వదిలి పెట్టదు.దీంతో ఏ పని చేయలేకపోతుంటారు.
ఎప్పుడు మంచానికే పరిమితం అవుతారు.కనీసం నడవడానికి కూడా శరీరం సహకరించదు.
అయితే అలాంటి సమయంలో ఇప్పుడు చెప్పబోయే డ్రింక్ ను డైట్ లో కనుక చేర్చుకుంటే ఎంతటి నీరసమైన ఇట్టే దూరం అవుతుంది.మరి ఇంకెందుకు ఆలస్యం ఆ డ్రింక్ ఏంటి.? దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి.? వంటి విషయాలపై ఓ లుక్కేయండి.
ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో రెండు ఎండిన అత్తి పండ్లు, పది పిస్తా పప్పులు, రెండు టేబుల్ స్పూన్లు ఎండు ద్రాక్ష, రెండు వాల్ నట్స్ వేసుకుని వాటర్ పోసి నానబెట్టుకోవాలి.అలాగే మరొక బౌల్ తీసుకుని అందులో ఐదు నుంచి ఎనిమిది బాదం పప్పులు వేసి వాటర్ వేసి నానబెట్టుకోవాలి.
ఇక చివరిగా మరో గిన్నెలో గింజ తొలగించిన ఖర్జూరాలు వేసి వాటర్ వేసి నానబెట్టుకోవాలి.
మరుసటి రోజు ఉదయాన్నే బ్లెండర్ తీసుకుని అందులో నానబెట్టుకున్న అత్తిపండ్లు, పిస్తా పప్పు, వాల్ నట్స్, ఎండుద్రాక్ష, ఖర్జూరాలు వేసుకోవాలి.
అలాగే నానబెట్టుకున్న బాదం పప్పును పొట్టు తొలగించి వేసుకోవాలి.చివరిగా ఒక గ్లాస్ సోయా పాలు లేదా బాదం పాలు లేదా గేదె పాలు వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
ఐదాదు నిమిషాల పాటు గ్రైండ్ చేసుకుంటే మన డ్రింక్ సిద్ధం అవుతుంది.ఈ డ్రింక్ ను బ్రేక్ ఫాస్ట్ సమయంలో తీసుకోవాలి.ఈ డ్రింక్ ను ప్రతి రోజూ తీసుకుంటే కనుక ఎలాంటి నీరసమైన దూరం అవుతుంది.పైగా ఈ డ్రింక్ ను తీసుకోవడం వల్ల శరీరానికి అవసరమయ్యే ప్రోటీన్ లభిస్తుంది.
వెయిట్ లాస్ అవుతారు.శరీరం యాక్టివ్ గా, ఎనర్జిటిక్ గా మారుతుంది.
మెదడు మునుపటి కంటే చురుగ్గా పని చేస్తుంది.ఎముకలు, కండరాలు దృఢంగా మారతాయి.
కాబట్టి నీరసం సమస్యతో బాధపడేవారు మాత్రమే కాదు ఎవ్వరైనా ఈ డ్రింక్ ను డైట్ లో చేర్చుకోవచ్చు.